News February 5, 2025

సిద్దిపేట: బ్యాంకు రుణాల పంపిణీ పూర్తి చేయాలి: కమిషనర్

image

బ్యాంకు రుణాల పంపిణీ పూర్తి చేయాలని హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ సూచించారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన పట్టణ మెప్మా ఆర్పీ రివ్యూ సమావేశం నిర్వహించారు. కాగా ఈనెల 25 ఫిబ్రవరి నాటికి కొత్త సంఘాల ఏర్పాటుతో పాటు బ్యాంకు రుణాల పంపిణీ పూర్తిచేయాలని కమిషనర్ ఆదేశించారు.

Similar News

News December 13, 2025

NGKL: 147 గ్రామాలలో 473 మంది సర్పంచ్ అభ్యర్థులు

image

జిల్లాలో ఈనెల 14న జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 147 గ్రామ పంచాయతీల్లో 473 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 151 గ్రామాలకు గాను 4 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. 1412 వార్డులకు గాను 143 వార్డులు ఏకగ్రీవం కాగా 1269 వార్డులలో 3228 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లాలోని బిజినేపల్లి, నాగర్‌కర్నూల్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, కొల్లాపూర్, కోడేరు, తిమ్మాజీపేటలలో ఎన్నికలు జరగనున్నాయి.

News December 13, 2025

నేడు కాణిపాకంలో నెల్లూరు కార్పొరేటర్ల ప్రమాణం.?

image

నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం ఘట్టం <<18549066>>వైకుంఠపాళి<<>>ని తలపిస్తోంది. అవిశ్వాసాన్ని నెగ్గించాలని TDP, అడ్డుకోవాలని YCP పావులు కదుపుతున్నాయి. పలువురు కార్పొరేటర్లు ‘<<18540168>>జంపింగ్ జపాంగ్<<>>’లా మారారు. ఎలాగైనా తమ కార్పొరేటర్లను కాపాడుకోవాలని TDP వారిని తిరుపతి తరలించిందట. మరికాసేపట్లో వారిని కాణిపాకం తరలించి ‘మేము TDPలోనే కొనసాగుతాం’ అని ప్రమాణం చేయించనున్నారట.

News December 13, 2025

ఖమ్మం: క్రిటికల్ పోలింగ్ కేంద్రాల పరిశీలించిన సీపీ

image

ఖమ్మం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు భారీ భద్రతా చర్యలు చేపడుతున్నట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. రూరల్ మండలంలోని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం 1,059 కేసుల్లో 7,129 మందిని బైండోవర్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సుమారు రెండు వేల మంది పోలీసు సిబ్బందితో భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.