News March 19, 2025
సిద్దిపేట: భట్టి బడ్జెట్‌పై బోలేడు ఆశలు..!

నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై జిల్లా ప్రజలు బోలేడు ఆశలు పెట్టుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగమైన మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్, గౌరవెల్లి ప్రాజెక్టుల కాల్వల నిర్మాణం, భూనిర్వాసితులకు పరిహారం నిధుల కేటాయింపుపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. చేర్యాల, దుబ్బాక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, జిల్లాలో కొత్తగా చేపట్టే ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తున్నారు.
Similar News
News March 1, 2026
నాడు కత్తుల పోరు.. నేడు క్షిపణుల హోరు

పూర్వం రాజ్యాల కోసం రాజులు దండెత్తి, అమాయకులను బలితీసుకున్నారనే గాథలు విన్నాం. నేడు ఆధునిక ప్రపంచంలోనూ అదే క్రూరత్వం కనిపిస్తోంది. ఒకరిని అంతం చేసేందుకు దేశాలు క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఈ భీకర దాడుల్లో పసిపిల్లలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. అభివృద్ధి చెందిన దేశాలు సైతం పాతకాలపు క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ అమాయకుల రక్తంతో యుద్ధ క్షేత్రాన్ని తడపడం మానవత్వానికే తీరని మచ్చ.
News March 1, 2026
వికారాబాద్ జిల్లాలో జాబ్ మేళా

వికారాబాద్ జిల్లా నిరుద్యోగ యువతకు ‘శుభ గృహ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్ పోస్టుల భర్తీకి మార్చి 5న ఉ.10:30 గం.కు వికారాబాద్ ఐటీఐ క్యాంపస్‌లో జాబ్ మేళా ఉంటుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ తెలిపారు. 30కి పైగా ఉన్న ఉద్యోగాలకి 10th, ఇంటర్, డిగ్రీ, ITI, డిప్లొమా, B.Tech, MBA, అర్హతలు కలిగిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News March 1, 2026
కలుపు మందుల వల్ల భూమికి కలిగే నష్టం

వ్యవసాయంలో కలుపు మొక్కల నివారణకు రసాయనాలతో కూడిన కలుపు మందుల వాడకం విపరీతంగా పెరిగింది. అనాలోచితంగా పంట భూములకు వీటిని వాడటం వల్ల కలుపుతో పాటు భూమిలో పంటకు మేలు చేసే జీవరాశి కూడా అంతమై, పంట పొలాలు నిర్జీవమయ్యే ప్రమాదం ఉంది. నేలలో జరిగే చర్యలు ఆగిపోయి మొక్కలకు పోషకాలు అందవు. సాగు, తాగు నీటి వనరులు, నేల నిర్మాణం పాడైపోయే ముప్పు ఉంది. అందుకే వీటిని తప్పనిసరిగా నిపుణుల సూచనలతో అవసరమైతేనే వాడాలి.


