News February 1, 2025

సిద్దిపేట: భార్య మృతి చెందిందని యువకుడి ఆత్మహత్య

image

ఉరేసుకుని యువకుడు మృతి చెందిన ఘటన ములుగు మండలం బహిలంపూర్‌లో శుక్రవారం జరిగింది. ఎస్ఐ విజయ్ కుమార్ వివరాలు.. వర్గల్ మండలంలోని మైలారానికి చెందిన భాను(22) భార్య మూడు నెలల కిందట ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి మనస్తాపంతో ఉన్న భాను 26న బహిలంపూర్ బంధువుల ఇంటికి వెళ్లాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి కనకమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News October 20, 2025

దీపావళి రోజన పిల్లిని పూజించే ఆచారం..

image

దీపావళిని మనం అజ్ఞానాన్ని తొలగించే దివ్య దీపాల పండుగ్గా జరుపుకొంటాం. కానీ అపశకునంగా భావించే పిల్లిని లక్ష్మీదేవిగా కొలిచి పూజించే సంప్రదాయం రాజస్థాన్‌లో ఉంది. దీపావళి పర్వదినాన అక్కడి మహిళలు మార్జాలానికి నైవేద్యం సమర్పిస్తారు. కర్ణాటకలోనూ ఈ ఆచారం ఉంది. ఆ రోజు తమ నగలను స్త్రీలు నదిలో శుభ్రం చేసి, అన్ని రకాల పిండి వంటలు వండి, పిల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఫలితంగా మంచి జరుగుతుందని నమ్ముతారు.

News October 20, 2025

ADB: గుస్సాడీ వేషధారణలో అదరగొట్టిన బాలుడు

image

భీంపూర్ మండలంలోని వాడేగామ గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు కాత్లే ఉమేష్ ఆదివాసీల గుస్సాడీ వేషధారణలో అదరగొట్టాడు. ఎంత ఆధునికత వచ్చినా, సంస్కృతిని కాపాడుకోవడంలో ఆదివాసీలు ముందున్నారని, ఈ బాలుడి రూపంలో వారసత్వం తరాలుగా ప్రవహిస్తోందని స్థానికులు కొనియాడారు. ఈ గుస్సాడీ వేషధారణ అందరినీ ఆకట్టుకుంది.

News October 20, 2025

నిర్మల్: జిల్లాలో మద్యం దుకాణాలకు 942 దరఖాస్తులు

image

జిల్లాలో 47 నూతన మద్యం దుకాణాలకు సంబంధించి మొత్తం 942 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి రజాక్ తెలిపారు. మద్యం దుకాణాల దరఖాస్తు గడు ఈనెల 23వ తేదీ వరకు పొడగించినట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన వారు మధ్య దుకాణాలకు జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవచ్చని అన్నారు. ఈనెల 27న దుకాణాల టెండర్లను డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేస్తున్నట్టు చెప్పారు.