News May 24, 2024

సిద్దిపేట: భూంపల్లి ఎస్సై రవికాంత్ రావు సస్పెండ్

image

సిద్దిపేట జిల్లా భూంపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ వి.రవి కాంత్ రావును సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. రవికాంత్.. మెదక్ జిల్లా శివంపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పని చేస్తున్న సమయంలో మామిడికాయల చోరీ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై శాఖా పరంగా ఉన్నతాధికారులు విచారణ జరిపారు. విధుల్లో అలసత్వం, అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News March 9, 2026

మెదక్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్

image

మెదక్ జిల్లా న్యాయమూర్తి నీలిమను జిల్లా కోర్టు ఛాంబర్‌లో సోమవారం కలెక్టర్ ప్రతిమా సింగ్ కలిశారు. ఇటీవల మెదక్ కలెక్టర్‌గా ప్రతిమా సింగ్ రాగా మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలు చర్చించారు. జిల్లాలో కోర్టులు, కేసుల పరిష్కారం, ఇతర విషయాలపై ఇరువురు మాట్లాడారు. పాలనాపరమైన అంశాలలో సహకారం ఉంటుందని పేర్కొన్నారు.

News March 8, 2026

తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర గొప్పది: కేసీఆర్

image

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సామాజిక సంపద సృష్టికర్తలని, దేశాభివృద్ధిలో పురుషులతో సమానంగా స్త్రీల భాగస్వామ్యం ఉందన్నారు. మానవ మనుగడను కొనసాగించే గొప్పబాధ్యతను అనేక కష్టాలను భరిస్తూ నిర్వర్తిస్తున్న మహిళ త్యాగశీలి అని కొనియాడారు. అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.

News March 8, 2026

మెదక్: 4 పురపాలికల ప్రథమ పౌరులు మహిళలే..!

image

మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు మహిళలే ప్రథమ పౌరులుగా ఎన్నికై రికార్డు సృష్టించారు. మెదక్‌లో కానుగు రాధిక, రామాయంపేటలో లావణ్య, తూప్రాన్‌లో రాజమణి, నర్సాపూర్‌లో లక్ష్మి మున్సిపల్ ఛైర్‌పర్సన్లుగా బాధ్యతలు చేపట్టారు. రిజర్వేషన్లు కలిసి రావడంతో నలుగురు మహిళా నేతలే పాలనా పగ్గాలు చేపట్టడం విశేషం. తమదైన ముద్ర వేస్తూ పట్టణాల అభివృద్ధికి కృషి చేస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.