News January 28, 2025
సిద్దిపేట: భూ తగాదాల రీత్యా కేసు నమోదు

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిద్దిపేట 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి అంకిరెడ్డిపల్లి గ్రామంలో సోమావారం భూ తగాదాల రీత్యా కేసు నమోదు చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్, సీఐ విద్యాసాగర్ తెలిపారు. అంకిరెడ్డిపల్లి గ్రామస్థులైన తాళ్లపల్లి భాగ్యలక్ష్మి దంపతుల ఫిర్యాదు మేరకు తాళ్లపల్లి నర్సింహులు, తాళ్లపల్లి చంద్రంపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
Similar News
News December 10, 2025
ప్రకాశం జిల్లాలో సబ్సిడీతో పెట్రోల్.!

ప్రకాశం జిల్లాలో మూడు చక్రాల మోటార్ వాహనాలు కలిగిన అర్హులైన దివ్యాంగులకు పెట్రోల్ సబ్సిడీతో మంజూరు చేయనున్నట్లు సంబంధిత శాఖ సహాయ సంచాలకులు సువార్త తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి పెట్రోల్ సబ్సిడీ మంజూరయిందన్నారు. పెట్రోల్ సబ్సిడీ పొందేందుకు ఆసక్తి గల దివ్యాంగ అభ్యర్థులు కార్యాలయంలో అందించే దరఖాస్తులను 17లోగా అందించాలని ఆమె తెలిపారు.
News December 10, 2025
చిత్తూరులో 12 మంది ఎస్ఐల బదిలీ

షేక్షావలి: సదుం TO వి.కోట
నాగసౌజన్య: NRపేట TO డీటీసీ
శివశంకర: సోమల TO చిత్తూరు మహిళా PS
సుబ్బారెడ్డి: రొంపిచెర్ల TO సీసీఎస్, చిత్తూరు
చిరంజీవి: తవణంపల్లె TO చిత్తూరు 1టౌన్
శ్రీనివాసులు: గుడుపల్లి TO సదుం
వెంకట సుబ్బయ్య: వెదురుకుప్పం TO వీఆర్
NOTE: VRలో ఉన్న శ్రీనివాసరావు(DTC), డాక్టర్ నాయక్(తవణంపల్లె), నవీన్ బాబు(వెదురుకుప్పం), పార్థసారథి(CCS), ఎన్.మునికృష్ణ(CCS)కు బాధ్యతలు అప్పగించారు.
News December 10, 2025
ADB: పల్లెల్లో ఎన్నికలు.. పట్టణాల్లో దావతులు

పంచాయతీ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. పట్టణాల్లో ఎన్నికల కోడ్ ఉండదని తెలిసి.. ఓటర్లను అక్కడికి తీసుకెళ్లి తమకే ఓటేయాలంటూ ఎర వేస్తున్నట్లు సమచారం. ఇప్పటికే ఎన్నికల నిబంధన కారణంగా వైన్స్ మూసివేయడంతో ఓటర్లను పట్టణాలకు తీసుకెళ్తున్నట్లు గ్రామాల్లో చర్చ నడుస్తోంది. అక్కడ వారికి దావత్లు ఇచ్చి రేపు ఉదయానికి గ్రామాలకు తీసుకెళ్లి ఓట్లు వేయించే పనిలో ఉన్నారు.


