News March 25, 2024
సిద్దిపేట: ‘మట్టి స్నానంతో రోగాలు దూరం’
మట్టి స్నానంతో రోగాలు దూరం అవుతాయని, మట్టి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుందని యోగా శిక్షకుడు తోట సతీశ్ తెలిపారు. వ్యాస మహర్షి యోగా సోసైటీ ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఆదివారం మడ్ బాత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో దాదాపు 80 మంది మట్టి స్నానం చేశారు. అధ్యక్షుడు నిమ్మ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. హోలీ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.
Similar News
News November 6, 2024
నర్సాపూర్: కాల్వలో బైక్ బోల్తా.. ఇద్దరి మృతి
బైక్ బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన నర్సాపూర్‌లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలా శివారులోని రాయరావు చెరువు కట్ట కాల్వలో బైక్ బోల్తా పడి మంగళవారం రాత్రి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయం మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతులు కాగజ్ మద్దూర్ గ్రామానికి చెందిన రాములు, వ్యాపారి నరసింహులుగా గుర్తించారు.
News November 6, 2024
మెదక్: GET READY.. నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టనుంది. ప్రతి ఇంటికి వెళ్లి 75 ప్రశ్నలతో ప్రభుత్వ సిబ్బంది సర్వే చేయనున్నారు. కుటుంబ యజమాని, సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు, వారు చేసే పని, తీసుకున్న రుణాలు, ఆస్తులు వంటి వివరాలను నమోదు చేసి సర్వే పూర్తయిన ఇంటికి స్టిక్కర్ వెయ్యనున్నారు. ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
News November 6, 2024
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు కుకునూరుపల్లి విద్యార్థి
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు కుకునూరుపల్లి మండలంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థి ఎండి అబ్దుల్ రహమాన్ ఎంపికయ్యారు. హుస్నాబాద్‌లో జరిగిన ఎస్జీఎఫ్ ఉమ్మడి మెదక్ జిల్లా హ్యాండ్ బాల్ అండర్-14 విభాగంలో జిల్లాస్థాయిలో సత్తా చాటి, రాష్ట్రస్థాయికి ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఓ బచ్చల సత్తయ్య, పీడీ రాజ్ కుమార్ విద్యార్థి అబ్దుల్ రెహ్మాన్‌ను అభినందించారు.