News March 21, 2024
సిద్దిపేట: మద్యం మత్తు జీవితాలు చిత్తు

మద్యం మత్తు వాహన చోదకుల జీవితాలను చిత్తు చేస్తోంది. సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ ట్రాఫిక్ పోలీస్ డివిజన్ వ్యాప్తంగా గత ఏడాది 9,645 మంది మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ.. పోలీసులకు పట్టుబడ్డారు. వారిపై కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా పలువురికి జైలు శిక్షలతో పాటు రూ.93.73 లక్షల జరిమానా విధించారు. 34 మంది జైలు శిక్ష విధించారు.
Similar News
News February 6, 2025
మెదక్: ఏడుపాయల ఉత్సవాలపై కలెక్టర్ సమీక్ష

ఏడుపాయల ఆలయం పార్కింగ్ నియంత్రణపై శాశ్వత పరిష్కారానికి పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఏడుపాయల ఆలయం పార్కింగ్ నియంత్రణకు శాశ్వత పరిష్కారం, మహాశివరాత్రి పర్వదినం, జాతర నిర్వహణకు శాఖల వారీగా కార్యచరణ పై చర్చించారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్ఓ భుజంగరావు, ఆర్డీవోలు రమాదేవి, మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.
News February 6, 2025
మెదక్: కుంభమేళకు వెళ్లొస్తుండగా ప్రమాదం.. వ్యక్తి మృతి

ఉత్తరప్రదేశ్‌లో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మనోహరాబాద్ మండలం డిలాయ్ (కూచారం) కు చెందిన ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. డిలాయ్ మెరుగు రవీందర్ యాదవ్ (45), గజ్వేల్ మండలం ఆరేపల్లికి చెందిన బామ్మర్ది భిక్షపతి కుటుంబం కుంభమేళాకు వెళ్లింది. ప్రయాగ్ రాజ్ నుంచి అయోధ్య వెళుతుండగా కారుకు ప్రమాదం జరిగింది. రవీందర్ మృతిచెందగా, కొడుకు క్రువిత్, బామ్మర్ది తిరుపతి గాయపడ్డారు.
News February 6, 2025
మెదక్: అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మృత దేహం

మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం తిమ్మాయిపల్లి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మృత దేహం పోలీసులు గుర్తించారు. మృతదేహన్ని తగులబెట్టారు. తల సగం కాలింది. ఆస్థి పంజరం మహిళదా? పురుషుడిదా? అనేది తేలాల్సి ఉంది. ఘటనా స్థలానికి హవేలి ఘనపూర్ పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం లభ్యం కావడంతో పరిసర గ్రామాల్లో ఎవరైనా కనిపించకుండా పోయారా అని ఆరా తీస్తున్నారు.