News March 12, 2025

సిద్దిపేట: మనం ప్రమాదకరమైన గాలిపీలుస్తున్నాం..!

image

కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులతో ప్రజలు ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికీ ప్రమాదముంది. సంగారెడ్డిలో గాలినాణ్యత విలువ 112గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరముంది. ఏమంటారు!

Similar News

News March 15, 2025

నిర్మల్‌: పరీక్షలో 151 మంది విద్యార్థుల గైర్హాజరు

image

నిర్మల్ జిల్లాలోని 23 పరీక్ష కేంద్రాల్లో శనివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 151 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ పరుశురాం తెలిపారు. మొత్తం 5,559 మంది విద్యార్థులకు గానూ 5,408 మంది పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు.

News March 15, 2025

ఆయుర్దాయం పెరగాలంటే ఇలా చేయండి!

image

ఫ్యామిలీతో కలిసి ఎక్కువకాలం బతకాలని అందరూ కోరుకుంటారు. ఇది సాధ్యం కావాలంటే కొన్ని పనులు చేయాలని నిపుణులు చెబుతున్నారు. కడుపులో 80 శాతం నిండినంత వరకే తినాలి. టీవీ, ఫోన్ చూడకుండా నెమ్మదిగా కింద కూర్చునే తినాలి. హెర్బల్ టీ తాగాలి. రోజూ 7-8 గంటలు నిద్రపోవాలి. సమీపంలోని ప్రదేశాలకు నడక ద్వారానే వెళ్లాలి. క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ చేయించుకుని వ్యాధులను గుర్తించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.

News March 15, 2025

ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ పనులు  

image

కేంద్ర ప్రభుత్వం తనిఖీ చేసిన తరువాత వెలువరించే ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. శనివారం కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివ రావు అసెంబ్లీలో చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి స్పందించారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై సానుకూలంగా ఉన్నామని తెలిపారు.

error: Content is protected !!