News March 7, 2025

సిద్దిపేట: మహిళలు మానవాళికి దిక్సూచి: అదనపు కలెక్టర్

image

మహిళలు మానవాళికి దిక్సూచి అని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) ఎన్సీసీ యూనిట్ ఆధ్వర్యంలో తెలంగాణ ఎన్సీసీ బెటాలియన్ ఆదేశాల మెరకు నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు అడిషనల్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్లకు విలువైన సూచనలిచ్చారు.

Similar News

News November 15, 2025

యూనిటీ మార్చ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్

image

భారతదేశంలో సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించారని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కొత్తగూడెంలో యూనిటీ మార్చ్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, బీజేపీ మాజీ అధ్యక్షుడు రంగా కిరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

News November 15, 2025

తెలంగాణ హైకోర్టు వెబ్‎సైట్ హ్యాక్

image

తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆర్డర్ కాపీలు డౌన్‎లోడ్ చేస్తుండగా అంతరాయం కలిగింది. ఈ సమయంలోనే న్యాయస్థానం వెబ్‎సైట్‎లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షం కావడంతో సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు హ్యాకర్ల గురించి దర్యాప్తు చేపట్టారు.

News November 15, 2025

సంగారెడ్డి: సర్వే చేయించుకున్నారు.. పైసలిస్తలేరు!

image

జిల్లాలో గత ఏడాది సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఎన్యుమరేటర్లకు పారితోషకాన్ని చెల్లించాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దత్తు డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సర్వే చేసి ఏడాది గడిచిన పారితోషకం చెల్లించకపోవడం విచారకరమని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారితోషకాన్ని వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.