News March 2, 2025
సిద్దిపేట: మహిళలు మౌనం వీడితే గెలిచినట్టే: సీపీ

మహిళలు మౌనం వీడి సమస్యలు చెబితే గెలిచినట్లేనని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. ఆదివారం సీపీ మాట్లాడుతూ.. మహిళలు మౌనంగా ఉండి కష్టాలు కొని తెచ్చుకోవద్దని సూచించారు. అలాగే ప్రజలు సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో షీ టీమ్స్, మహిళలకు, బాలికలకు భద్రత భరోసాపై అధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు.
Similar News
News December 22, 2025
రెండో పెళ్లిపై మారుతున్న దృక్పథం

భారతీయుల్లో రెండో పెళ్లిపై అభిప్రాయాలు వేగంగా మారుతున్నాయి. రీబౌన్స్ మ్యాచ్‌మేకింగ్ యాప్ నిర్వహించిన తాజా సర్వేలో విడాకులు తీసుకున్న వారిలో 28% మంది మళ్లీ పెళ్లికి సిద్ధమని వెల్లడించారు. గతం తమ భవిష్యత్తును డిసైడ్ చేయకూడదని వారు భావిస్తున్నారు. ఈ మార్పులో మహిళలే ముందుండటం గమనార్హం. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఈ ఆలోచనా ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. సమాజంలో మారుతున్న ఈ ఆలోచనా విధానంపై మీ Comment?
News December 22, 2025
ఏర్పేడు: ముగిసిన ఇంటర్ స్పోర్ట్స్ మీట్.!

తిరుపతి IIT వేదికగా జరుగుతున్న 58వ ఇంటర్ స్పోర్ట్స్ మీట్ ఆదివారంతో ముగిసింది. ఐఐటీ మద్రాస్ కార్పొరేట్ రిలేషన్స్ డీన్ అశ్విన్ మహాలింగం అతిథిగా హాజరయ్యారు. విజేతలు వీరే:
> చెస్ విజేత : IIT బాంబే రన్నర్ : మద్రాస్
> మహిళల టెన్నిస్ విజేత : IIT మద్రాస్ రన్నర్ : ఢిల్లీ
> పురుషుల టెన్నిస్ విజేత : IIT మద్రాస్ రన్నర్ : కాన్పూర్
> వెయిట్ లిఫ్టింగ్టీం ఛాంపియన్ : IIT రూర్కీ.
News December 22, 2025
తిరుపతి: ‘కరంటోళ్ల జనబాట’కు ఏపీఎస్పీడీసీఎల్ శ్రీకారం

ఏపీఎస్పీడీసీఎల్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా సీఎండీ శివశంకర్ ‘కరంటోళ్ల జనబాట’ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈనెల 22వ తేదీన పాకాల మండలంలో మంత్రి రవికుమార్ దీనిని ప్రారంభించనున్నారు. విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.


