News February 25, 2025

సిద్దిపేట: మహిళా కానిస్టేబుల్ సూసైడ్

image

సిద్దిపేట జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్ యాదాద్రి జిల్లాలో బలవన్మరణానికి పాల్పడింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరూకొలు గ్రామానికి చెందిన అనూష(26) భువనగిరిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ భువనగిరిలో నివాసం ఉంటున్నారు. తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News January 1, 2026

NLG: మున్సిపల్ ఎన్నికలు.. ఆ రోజు తుది ఓటర్ జాబితా!

image

ముసాయిదా ఓటరు జాబితా ప్రకటన, అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఈనెల 5వ తేదీన నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో జనవరి 6వ తేదీన ఆయా పార్టీల నేతలతో సమావేశాలు నిర్వహించి వారి సూచనలు తీసుకుని అవసరమైతే మార్పులు, చేర్పులు చేపట్టనున్నారు. జనవరి 10న మున్సిపల్ తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు.

News January 1, 2026

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. డైరెక్టర్ ఎవరంటే?

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన నటిస్తారని నిర్మాత రామ్ తళ్లూరి పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి కథా చర్చలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. డ్రీమ్ ప్రాజెక్ట్ లోడింగ్ అంటూ రాసుకొచ్చారు. వక్కంతం వంశీ ఈ మూవీకి కథ అందిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల కావాల్సి ఉంది.

News January 1, 2026

కారు డ్యాష్‌బోర్డులో గణపతి విగ్రహం ఉందా?

image

కారులో వినాయకుడి విగ్రహం ఉంచడం రక్షణకు, శుభానికి సంకేతం. విగ్రహం కూర్చున్న భంగిమలో, తొండం ఎడమ వైపుకు, డ్రైవర్ వైపు తల ఉండటం వల్ల సానుకూల శక్తి లభిస్తుందని నమ్మకం. విగ్రహం చిన్నదిగా ఉండి, డ్రైవింగ్‌కు అడ్డంకి కాకుండా స్థిరంగా అంటించాలి. నిత్యం శుభ్రత పాటిస్తూ, విగ్రహంపై దుమ్ము లేకుండా చూడాలి. ఒకవేళ విగ్రహం విరిగితే వెంటనే మార్చాలి. ఈ నియమాలు పాటిస్తే ప్రయాణం సురక్షితంగా, ప్రశాంతంగా సాగుతుంది.