News February 25, 2025
సిద్దిపేట: మహిళా కానిస్టేబుల్ సూసైడ్

సిద్దిపేట జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్ యాదాద్రి జిల్లాలో బలవన్మరణానికి పాల్పడింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరూకొలు గ్రామానికి చెందిన అనూష(26) భువనగిరిలో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ భువనగిరిలో నివాసం ఉంటున్నారు. తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News February 26, 2025
మెదక్: టెన్త్, ఇంటర్ పరీక్షలపై కలెక్టర్ సమీక్ష

మెదక్: త్వరలో జరగనున్న పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్, అదనపు ఎస్పీలతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద భద్రత, సిబ్బంది గురించి సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
News February 25, 2025
మెదక్: దంచి కొడుతున్న ఎండ

మెదక్ జిల్లాల్లో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. ప్రతి ఏడాది మార్చిలో కనింపించే ఎండ ప్రభావం ఈ ఏడాది ముందుగానే కనిపిస్తోంది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సాధరణం కంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు, మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రత అధికంగా నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
News February 25, 2025
మెదక్: ఏడుపాయల జాతరకు భారీగా బస్సులు

ఏడుపాయల జాతరకు భారీగా ఆర్టీసీ బస్సులను అధికారులు నడపనున్నారు. ఈ నెల 26 నుంచి 28 తేదీ వరకు మూడు రోజుల పాటు ఏడుపాయల జాతర కొనసాగనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, జేబీఎస్ నుంచి 300 బస్సులు, పటాన్చెరు, నారాయణఖేడ్, జహీరాబాద్ డిపోల నుంచి మరో 50 చొప్పున మొత్తం 400 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు నడపనున్నారు. రద్దీని బట్టి మరిన్ని బస్సులు నడుపుతామని మెదక్ డీఎం సరేఖ పేర్కొన్నారు.