News February 25, 2025

సిద్దిపేట: మహిళా కానిస్టేబుల్ సూసైడ్

image

సిద్దిపేట జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్ యాదాద్రి జిల్లాలో బలవన్మరణానికి పాల్పడింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరూకొలు గ్రామానికి చెందిన అనూష(26) భువనగిరిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ భువనగిరిలో నివాసం ఉంటున్నారు. తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News March 17, 2025

ADB: ఆ రైతు గ్రేట్.. తొలికాత విద్యార్థులకే

image

సహజంగా ఏ రైతైనా పంట కాతను దేవుడికి సమర్పిస్తుంటారు.. కానీ ఆ రైతు మాత్రం తాను పండించిన పంటను ముందుగా విద్యార్థులకే అందిస్తుంటారు. బాలల్లోనే తాను దైవాన్ని చూస్తానని చెబుతున్నారు. తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన రైతు అండే ఆనంద్ తాను సాగుచేస్తున్న పుచ్చకాయ(వాటర్‌మిలన్) తొలి కాతను ఏటా విద్యార్థులకు పంచి పెడుతున్నారు. రైతును పలువురు అభినందిస్తున్నారు. మీ ప్రాంతంలోనూ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి.

News March 17, 2025

ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలి: అడిషనల్ కలెక్టర్లు

image

మహబూబాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, వీరబ్రహ్మచారి వినతులు స్వీకరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ పథకాలలోనైన లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, సమస్యలను సత్వరమే పరిష్కరించడం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అధికారులు పాల్గొన్నారు.

News March 17, 2025

నంద్యాల జిల్లాలో 394 మంది గైర్హాజరు

image

నంద్యాల జిల్లా పరిధిలో సోమవారం తొలిరోజు పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 394 మంది పరీక్షలకు గైర్హాజరైనట్లు DEO జనార్దన్ రెడ్డి తెలిపారు.  మొత్తం 24,907 మంది పరీక్షలు రాయాల్సి ఉంది. 24,513 మంది పరీక్షలు రాశారని డీఈవో చెప్పారు.

error: Content is protected !!