News January 24, 2025
సిద్దిపేట: మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం బాధాకరం: హరీష్ రావు

జగిత్యాల జిల్లా మొగిలిపేట గ్రామసభలో మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకొని, ములుగు జిల్లా బట్టాయిగూడెంలో నాగయ్య అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు ‘X’లో ఆవేదన వ్యక్తపరిచారు. తన చావుతోనైనా అర్హులకు పేదలకు పథకాలు ఇవ్వాలని అధికారులకు చెబుతూ ఆస్పత్రి పాలైన రైతన్న దుస్థితికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు
Similar News
News November 1, 2025
పెండింగ్ రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్

నల్గొండ జిల్లాలలో పెండింగ్లో ఉన్న వివిధ రెవెన్యూ దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం రెవెన్యూ అంశాలపై ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న భూ రికార్డులు, భూ భారతి, భూ వివాదాల దరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 1, 2025
పెద్దపల్లి: ప్రమాదాలకు నిలువుగా రాజీవ్ రహదారి

PDPL పట్టణంలోని రాజీవ్ రహదారికి సర్వీస్ రోడ్లు లేక ప్రమాదాలకు నిలువుగా మారింది. గురువారం ఉదయం బంధంపల్లి శాంతినగర్కు చెందిన పెంజర్ల లక్ష్మీనారాయణ (35) పాలు అమ్మడానికి వెళ్తుండగా బస్టాండ్ సిగ్నల్ వద్ద గోదావరిఖని వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతనిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 1, 2025
6.30 నుంచే పెన్షన్ల పంపిణీ: తిరుపతి కలెక్టర్

తిరుపతి జిల్లాలో శనివారం ఉదయం 6.30కే పెన్షన్లు పంపిణీ ప్రారంభించాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఎట్టి పరిస్థితిలోనూ ఉదయం 7గంటలకు 100 శాతం సిబ్బంది పింఛన్ల పంపిణీ ప్రారంభించాలన్నారు. పునః పరిశీలనలో అనర్హులుగా గుర్తించిన పింఛనుదారులు, అప్పీలు చేసుకోని వారికి కూడా ఈనెల పింఛన్ను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వారికీ సచివాలయ సిబ్బంది నగదు పంపిణీ చేయాలన్నారు.


