News February 20, 2025
సిద్దిపేట: మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్

అత్యవసర సమయంలో ఒకరికి రక్త దానం చేసి మానవత్వాన్ని ఓ కానిస్టేబుల్ చాటాడు. సిద్దిపేట పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అత్యవసరంగా ఆపరేషన్ సమయంలో ” O ” పాజిటివ్ బ్లడ్ అవసరమైంది. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ శేఖర్ వెంటనే మిత్ర బ్లడ్ బ్యాంక్ వెళ్లి రక్తదానం చేశాడు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న వ్యక్తి కుటుంబ సభ్యులు కానిస్టేబుల్కు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News December 9, 2025
సూర్యాపేట: ముగిసిన మొదటి విడత ఎన్నికల ప్రచారం

సూర్యాపేట జిల్లాలో గ్రామపంచాయతీ, వార్డు సభ్యుల ఎన్నికల మొదటి విడత ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసినప్పటి నుంచి బరిలో నిలిచిన వివిధ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొన్నారు. ఈనెల 11న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారంలో నిలబడిన అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
News December 9, 2025
మెదక్: సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా చుక్క రాములు

సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా చుక్క రాములు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మెదక్లో మూడు రోజులుగా జరిగిన రాష్ట్ర 5వ మహాసభల్లో ఈ మేరకు తీర్మానం చేశారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా పాలడుగు భాస్కర్, కోశాధికారిగా రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అనేక కార్మిక అంశాలపై తీర్మానాలు చేశారు. నూతన కార్యవర్గానికి మెదక్ జిల్లా కార్యదర్శి మల్లేశం అభినందనలు తెలిపారు.
News December 9, 2025
ఫ్యూచర్ సిటీతో 13 లక్షల ఉద్యోగాలు: శ్రీధర్ బాబు

TG: దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రపంచస్థాయి నగరంగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని అభివృద్ధి చేయనున్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ‘13,500 ఎకరాల్లో జీరో కార్బన్ సిటీగా దీన్ని రూపొందిస్తాం. ఇక్కడి సంస్థల ద్వారా 13L మందికి ఉద్యోగాలు వస్తాయి. 9 లక్షల జనాభాకు వీలుగా గృహ నిర్మాణం జరుగుతుంది. డేటా సెంటర్లకు 400 ఎకరాలిస్తాం’ అని వివరించారు. అద్భుత ఆర్కిటెక్చర్ అర్బన్ ఫారెస్టులు ఉంటాయన్నారు.


