News April 4, 2025
సిద్దిపేట: ముఖ్య నేతలతో సమావేశమైన కేసీఆర్

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని ఎర్రవల్లి కేసిఆర్ వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ముఖ్య నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. ముఖ్య నేతలతో కేసీఆర్ ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే సిల్వర్ జూబ్లీ భారీ బహిరంగ సభ విజయవంతం కోసమే సమీక్షలు సమావేశం నిర్వహించారు.
Similar News
News September 17, 2025
HYD: ప్రపంచాన్ని ఆకర్షించేలా మూసీని మారుస్తాం: సీఎం

మూసీని శుద్ధి చేసి HYDను సుందరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తేల్చిచెప్పారు. ప్రజాపాలన వేడుకల్లో మాట్లాడుతూ.. మూసీ చుట్టూ బతుకుతున్న ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామని, మూసీని శుద్ధి చేసి కొత్త ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తామన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా మూసీ నదిని మారుస్తామన్నారు.
News September 17, 2025
HYDలో జాతీయ జెండా ఆవిష్కరించిన కవిత

తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు ఎంకే. మొయినుద్దీన్ని శాలువా పూలమాలలతో సత్కరించారు.
News September 17, 2025
గ్రూప్-1పై డివిజన్ బెంచ్కు టీజీపీఎస్సీ

TG: గ్రూప్-1 మెయిన్స్ <<17655670>>ఫలితాలను<<>> రద్దుచేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. ఈ నెల 9న ఫలితాలను రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.