News March 19, 2025
సిద్దిపేట: ముగ్గురు ఎంపీడీవోలకు పదోన్నతి

సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట జిల్లాలో ఎంపీడీవోలుగా పనిచేస్తున్న ఏ. ప్రవీణ్, జయరాం, ఏపీడీగా పనిచేస్తున్న శ్రీనివాస్ గౌడ్లకు డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతి కల్పిస్తూ పంచాయతీ రాజ్ డైరెక్టర్ శ్రీజన ఉత్తర్వులు వెలువరించారు.
Similar News
News December 10, 2025
విజయవాడ: స్నాన ఘాట్లు, కేశఖండనశాలల ఏర్పాటు

దీక్షల విరమణకు విజయవాడ వచ్చే భక్తుల సౌకర్యార్థం స్నాన ఘాట్ల వద్ద విస్తృత ఏర్పాట్లు చేశారు. సీతమ్మవారి పాదాల వద్ద 600, భవానీ ఘాట్ వద్ద 100, పున్నమి ఘాట్ వద్ద 100 మొత్తం 800 షవర్లు ఏర్పాటు చేశారు. అలాగే మహిళలు బట్టలు మార్చుకునేందుకు సీతమ్మవారి పాదాల వద్ద 10, పున్నమి ఘాట్ వద్ద 2, భవానీ ఘాట్ వద్ద 2 గదులు సిద్ధం చేశారు. కేశఖండన కోసం మొత్తం 850 మంది నాయి బ్రాహ్మణులను వినియోగిస్తున్నారు.
News December 10, 2025
విజయవాడ: చిన్నారులకు కిడ్స్ ట్రాకింగ్ బ్యాండ్లు

భవానీ దీక్షల విరమణ కార్యక్రమం కోసం భక్తుల భద్రత నిమిత్తం 4వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. చిన్న పిల్లల భద్రత కోసం ప్రత్యేకంగా కిడ్స్ ట్రాకింగ్ రిస్ట్ బ్యాండ్లను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 270 సీసీ కెమెరాలకు అదనంగా 50 కెమెరాలను జోడించి, మొత్తం 320 సీసీ కెమెరాల పర్యవేక్షణలో భద్రతను పటిష్ఠం చేశారు.
News December 10, 2025
6 మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు: ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికలు నేపథ్యంలో ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టర్ రాజర్షి షా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ప్రచారం ముగిసిన వెంటనే 6 మండలాల్లోని మద్యం దుకాణాలు, బార్లు పూర్తిగా మూసివేయాలని సూచించారు.


