News February 21, 2025
సిద్దిపేట: యువకుడి దారుణ హత్య

సిద్దిపేటలో యువకుడిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. పట్టణంలోని డబుల్ బెడ్ రూం ఇళ్లలో నివాసం ఉంటున్న శ్రీను(29)ను నర్సాపూర్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఇంటిలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనుపై దాడి చేసి హత్య చేశారు. మృతుడికి నేర చరిత్ర ఉందని, పలు కేసులు ఉన్నట్లు సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు. మృతుడి భార్య సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Similar News
News December 7, 2025
భీమవరం: రేపు యథావిధిగా PGRS- కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రజలనుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేనివారు 1100 కాల్ సెంటర్ ద్వారా లేదా meekosam.ap.gov.in వెబ్సైట్లో తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 7, 2025
అనంతపురంలో రేపు ప్రజా వేదిక: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తామని కలెక్టర్ ఆనంద్ ఆదివారం తెలిపారు. కాల్ సెంటర్ 1100ను అందరికీ అందుబాటులో ఉంచామన్నారు. అర్జీలు పరిష్కారం కాకపోయినా, అర్జీల పరిస్థితిని తెలుసుకోవాలన్నా 1100కు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 7, 2025
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

పుట్టపర్తితో పాటు మండల, డివిజన్, మునిసిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తులను కలెక్టరేట్కు వచ్చే అవసరం లేకుండా meekosam.ap.gov.inలో ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


