News January 6, 2025

సిద్దిపేట: యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు

image

యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు నమోదైంది. పోలీసుల ప్రకారం.. సిద్దిపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి చిన్నకోడూరు వాసి చెందిన నిఖిల్ రెడ్డి ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో యువతి 2 సార్లు గర్భవతి కాగా అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా ఆమె నగ్నచిత్రాలు ఉన్నాయని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. నిఖిల్‌కు మరో యువతితో నిశ్చితార్థం అవ్వడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Similar News

News January 9, 2025

సిద్దిపేట: విద్యార్థులను చితకబాదిన ఫిజికల్ డైరెక్టర్

image

విద్యార్థులను టీచర్ చితకబాదిన ఘటన సిద్దిపేట(D) దుద్దెడ గురుకులలో జరిగింది. టెన్త్,ఇంటర్ విద్యార్థులకు ఉదయం నిర్వహించిన స్టడీ అవర్స్‌కు ఆలస్యంగా వచ్చిన 30 మంది విద్యార్థులను PD వాసు ఒళ్లంతా వాతలు వచ్చేలా కొట్టాడు. తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని పిల్లలను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. PDని సస్పెండ్ చేయాలని ఆందోళనకు దిగారు. తీవ్రంగా గాయపడిన వారికి సిద్దిపేటలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించినట్లు సమాచారం.

News January 9, 2025

తిరుపతి తొక్కిసలాటపై మంత్రి దామోదర దిగ్ర్భాంతి

image

తిరుపతి తొక్కిసలాట ఘటనలో భక్తులు మృతి చెందడంపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. తొక్కిసలాటలో గాయపడి, చికిత్స పొందుతున్న భక్తులు త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి, టీటీడీకి ఆయన విజ్ఞప్తి చేశారు.

News January 9, 2025

మెదక్: జిల్లాలో టీబీ నియంత్రణకు విశేష కృషి: కలెక్టర్

image

మెదక్ జిల్లాలో టీబీ నియంత్రణకు విశేష కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్‌తో కలిసి జాతీయ టీబీ బృందం సభ్యులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. డెంగ్యూ, మలేరియా వ్యాధుల నివారణకు ఆరోగ్య శాఖ యంత్రాంగం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.