News March 23, 2025

సిద్దిపేట: యువతి అదృశ్యం- మిస్సింగ్ కేసు నమోదు

image

యువతి అదృశ్యమైన ఘటన వర్గల్ మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. నాచారం గ్రామానికి చెంది పర్స కృపారాణి (20) శుక్రవారం గ్రామంలోని కుట్టు మిషన్ నేర్చుకుంటానని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గ్రామంలో, బంధువుల వద్ద ఆచూకీ కోసం వెతికిన కనిపించలేదు. శనివారం యువతి తండ్రి పర్స స్వామి ఫిర్యాదు మేరకు గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 27, 2025

జూబ్లీ బైపోల్: కమలానికి టీడీపీ, జనసేన సహకారం?

image

ప్రస్తుతం ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం నడుస్తోంది. దీంతో కూటమిలోని ప్రధాన పార్టీలు టీడీపీ, జనసేనలు జూబ్లీహిల్స్ బై పోల్‌లో కమలానికి మద్దతునిస్తున్నట్లు సమాచారం. ఆ 2 పార్టీల నాయకులు అంతర్గతంగా బీజేపీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కమలం విజయం సాధిస్తే తమ వల్లే విజయం సాధించిందని చెప్పుకునేందుకు అవకాశముంటుందని ఇరుపార్టీల అధినేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

News October 27, 2025

GNT: తుపాను సహాయక చర్యలకు రూ. 50 లక్షలు విడుదల

image

తుపాను సహాయక చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ. 50 లక్షలను విడుదల చేసింది. ఈ నిధులను బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడం, సురక్షితమైన తాగునీరు, ఆహారం సరఫరా చేయడం. వైద్య శిబిరాల నిర్వహణ, పారిశుద్ధ్యం, రోడ్లు, నీటిపారుదల ప్రాజెక్టులకు అత్యవసర మరమ్మతులకు వినియోగించుకోవాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. అవసరమైతే బాధితులను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవాలని సూచించింది.

News October 27, 2025

చీర్యాల నరసింహస్వామికి జడ్జి ప్రత్యేక పూజలు

image

చీర్యాల లక్ష్మీ నృసింహ స్వామి వారి సేవలో మేడ్చల్ మల్కాజిరి జడ్జి హారిక కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. వారికి ఆలయ ఫౌండర్ & ఛైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ వేద పండితులతో కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి దర్శనాన్ని కల్పించారు. అనంతరం స్వామివారి శేష వస్త్రాలు తీర్థ ప్రసాదాలతో ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శ్రీ హరి ఉన్నారు.