News March 31, 2025

సిద్దిపేట: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు.!

image

రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసం దీక్షలు, ప్రేమ, దయ, సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని పేర్కొన్నారు. గంగా జమున తహజీబ్‌కు తెలంగాణ ప్రతీక అన్నారు. రంజాన్ పండుగను అధికారికంగా ప్రకటించిన ఘనత కేసిఆర్ కే దక్కింది అన్నారు. అల్లా దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

Similar News

News November 8, 2025

ఈనెల 10న హనుమకొండలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

image

ఈనెల 10న (సోమవారం) హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లపై హనుమకొండ ఇన్‌‌స్పెక్టర్ శివకుమార్ అధికారులతో కలిసి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేల సంఖ్యలో యువకులు ఈ రిక్రూట్‌మెంట్‌కు హాజరవుతుండడంతో ఎలాంటి సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఇన్‌స్పెక్టర్ అధికారులతో చర్చించారు.

News November 8, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 8, 2025

త్వరలో రూ.8 కోట్లు విడుదల: కలెక్టర్

image

మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన ఉల్లి పంటకు రూ.10 కోట్లు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని, మిగిలిన రూ.8 కోట్లు త్వరలోనే జమ చేస్తామని కర్నూలు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంతో సాంకేతిక పరిజ్ఞానం, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోలులో తేమశాతం 13-14% ఉన్నా కొనుగోలు చేయాలన్నారు.