News March 31, 2025
సిద్దిపేట: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు.!

రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసం దీక్షలు, ప్రేమ, దయ, సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని పేర్కొన్నారు. గంగా జమున తహజీబ్‌కు తెలంగాణ ప్రతీక అన్నారు. రంజాన్ పండుగను అధికారికంగా ప్రకటించిన ఘనత కేసిఆర్ కే దక్కింది అన్నారు. అల్లా దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
Similar News
News April 23, 2025
సర్కార్ బడిలో మెరిసిన ఆణిముత్యం

తాజాగా విడుదలైన టెన్త్ ఫలితాల్లో పల్నాడు జిల్లా విద్యార్థిని అద్భుతంగా రాణించారు. కారంపూడి మండలం ఒప్పిచర్ల జడ్పీ పాఠశాల విద్యార్థిని పావని చంద్రిక 600కు 598 మార్కులు సాధించారు. ప్రభుత్వ పాఠశాలలో చదవి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన విద్యార్థినిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ లలిత, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.
News April 23, 2025
వరంగల్ చపాటా అంటే నర్సంపేటనే..!

చపాటా మిర్చి పంట సాగుకు ఉమ్మడి వరంగల్ జిల్లా పెట్టింది పేరు. కానీ ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా సాగయ్యేది నర్సంపేట నియోజకవర్గంలో మాత్రమే. విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న ఈ చపాటా మిర్చిని మొదట నల్లబెల్లికి చెందిన రైతులు సాగు చేశారు. తర్వాత నల్లబెల్లి, నర్సంపేట, దుగ్గొండి, చెన్నారావుపేట, నెక్కొండ తదితర మండలాల్లోని రైతులు ఈ రకం మిర్చి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఈ మిర్చికి భౌగోళిక గుర్తింపు వచ్చింది.
News April 23, 2025
BRS పేరు మారుస్తారా? KTR ఏమన్నారంటే?

TG: BRS పేరు మార్చాల్సిన అవసరం లేదని, తీరు మార్చుకోవాలని KTR ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. KCR లెజెండ్, కారణజన్ముడు అని పేర్కొన్నారు. KCR కాకుండా తనకు నచ్చిన CM పినరయి విజయన్(కేరళ) అని తెలిపారు. రేవంత్ రెడ్డి అదృష్టవంతుడని, పవన్ కళ్యాణ్ తాను ఊహించిన దానికంటే ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు. మోదీ మతపరమైన అజెండాను ప్రచారం చేస్తున్నారని, ఇప్పటివరకు PMగా చేసిందేం లేదని అభిప్రాయపడ్డారు.