News March 12, 2025
సిద్దిపేట: రవాణా శాఖకు గొప్ప పేరు తేవాలి: మంత్రి పొన్నం

AMVI లుగా నూతనంగా ఎంపికై నియామకాలు పొందిన వారు రవాణా శాఖకు గొప్ప పేరు తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ పోలీస్ అకాడమీలో AMVI (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్)గా ఎంపికై నియామకమైన వారికి ఇచ్చిన శిక్షణ తరగతుల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఉద్యోగం ఒక బాధ్యత అని బాధ్యతతో పని చేయాలని సూచించారు. శిక్షణకు వచ్చిన AMVI లను అభినందించారు.
Similar News
News March 23, 2025
పైరవీలు లేకుండా, పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక: భట్టి

TG: రాజీవ్ యువ వికాసం పథకానికి లబ్ధిదారులను పైరవీలు లేకుండా, పారదర్శకంగా ఎంపిక చేయాలని అధికారులను Dy.CM భట్టి విక్రమార్క ఆదేశించారు. APR 5లోగా దరఖాస్తులు స్వీకరించి, APR 6 నుంచి మండల స్థాయిలో స్క్రూటినీ, ఆ తర్వాత కలెక్టర్ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక చేయాలన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అప్రూవల్ వచ్చాక లబ్ధిదారులను ప్రకటించాలన్నారు. JUNE 2 నుంచి మంజూరు పత్రాలు అందజేస్తామని చెప్పారు.
News March 23, 2025
నిజామాబాదులో వ్యక్తి దారుణ హత్య

వేల్పూర్ మండలం పచ్చలనడ్కడలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడు మహారాష్ట్రకు చెందిన శంకర్‌గా గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన శంకర్, బాలాజీ ఇద్దరు నెల రోజుల నుంచి గ్రామంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ కూలి పని చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ఇరువురు గొడవ పడ్డారు. అనంతరం బాలాజీ కనపడ లేదు. శనివారం దుర్వాసన రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సంజీవ్ మృతదేహాన్ని మార్చురీకి తరలించి దర్యాప్తు చేపట్టారు.
News March 23, 2025
NZB: మునగ చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

మునగ చెట్టుపై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు టూ టౌన్ ఎస్ఐ అరాఫత్ అలీ తెలిపారు. ఆనంద్ నగర్‌కు చెందిన లక్ష్మణ్(56) ఈ నెల 18వ తేదీన పని కోసం బయటకు వెళ్లాడు. అనంతరం ఓ మునగ చెట్టు కనపడడంతో దానిపైకి ఎక్కిగా చెట్టు విరిగి కింద పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన లక్ష్మణ్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరాకు దర్యాప్తు చేపట్టారు.