News March 17, 2025
సిద్దిపేట: రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభంపై సమీక్ష

ప్రజా భవన్లో ఆదివారం రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో అధికారులతో కలిసి రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలపై చర్చించారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు తెలిపారు.
Similar News
News November 26, 2025
సోఫాపై మరకలు పోవాలంటే..

* సోఫాపై మరకలు తొలగించడానికి ముందు ఒక తడి క్లాత్‌తో సోఫాను తుడిచి, బేకింగ్ సోడా, నీటిని కలిపి పేస్ట్ చేసి మరకలున్న చోట ఈ పేస్ట్‌ను అప్లై చేసి 20నిమిషాల తర్వాత శుభ్రమైన తడి క్లాత్‌తో తుడిస్తే మరకలు పోతాయి.
* బబుల్ గమ్ అంటుకున్న బట్టలను గంట పాటు ఫ్రిజ్‌లో పెట్టినా/ఐస్‌క్యూబ్‌లతో రబ్ చేసినా ఫలితం ఉంటుంది.
* ల్యాప్‌టాప్ స్క్రీన్ క్లీన్ చేయడానికి మైక్రోఫైబర్ క్లాత్ వాడాలి. దీంతో స్క్రీన్ దెబ్బతినదు.
News November 26, 2025
ఓవర్ స్పీడ్‌తో వెళ్లే వాహనాలు సీజ్: సీఎం

AP: రాష్ట్రంలో ప్రతి రోడ్డుప్రమాదంపై థర్డ్ పార్టీ ద్వారా ఆడిటింగ్ నిర్వహించాలని CM చంద్రబాబు ఆదేశించారు. ప్రమాదానికి కారణం వాహనమా, డ్రైవరా లేదా రోడ్డు ఇంజినీరింగ్ లోపమా అన్న వివిధ అంశాలను గుర్తించేలా ఈ ఆడిటింగ్ జరగాలన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15,462 రహదారి ప్రమాదాల్లో 6,433 మంది మృతి చెందటంపై ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్చరికలు జారీ చేసినా ఓవర్ స్పీడ్‌తో వెళ్లే వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు.
News November 26, 2025
22A భూములపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి: మంత్రి నాదెండ్ల

22A కింద నమోదైన జిరాయితీ భూముల యజమానులు భూములు అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. పొరపాటుగా నమోదైన భూములను 22A జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని, దీనిని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని సీఎం ఆదేశించారన్నారు.


