News March 29, 2025
సిద్దిపేట: రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ వారు రూపొందించిన రాజీవ్ యువ వికాసం పోస్టర్లను శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఈడీ ఎస్సీ కార్పొరేషన్ రామాచారితో కలిసి పంపిణీ ఆవిష్కరించారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
Similar News
News December 4, 2025
నెల్లూరు: వీఆర్సీ అండర్ బ్రిడ్జ్ వద్ద రాకపోకలు బంద్

వీఆర్సీ అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలబడడంతో ఆ ప్రాంతంలో అధికారులు రాకపోకలను నిషేధించారు. ఇటీవల ఈ అండర్ బ్రిడ్జి రిపేర్లు చేసిన విషయం తెలిసిందే. సుమారు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ నీళ్లు నిలబడడంతో రాకపోకలు సాగించలేని పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో వాహనాలను అనుమతించడం లేదు. దీనివల్ల ప్రజలు కిలోమీటర్ తిరిగి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది.
News December 4, 2025
ఈఎస్ఐ గేటు వద్ద మృతదేహంతో ఆందోళన

ఈఎస్ఐ గేటు వద్ద కూర్మన్నపాలేనికి చెందిన మహిళ మృతి చెందడంతో బంధువులు, కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. ఈఎస్ఐ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే పార్వతి చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. గైనిక్ ప్రాబ్లం కావడంతో పార్వతి ఆసుపత్రిలో జాయిన్ కాగా పరిస్థితి విషమించటంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. దీంతో బంధువులు మృతదేహాన్ని గేటు వద్దకు తెచ్చి ఆందోళన చేపట్టారు
News December 4, 2025
పుతిన్ పర్యటనతో భారత్కు లాభమేంటి?

* ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ మిస్సైళ్లు, డ్రోన్లను కూల్చడానికి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ బాగా ఉపయోగపడ్డాయి. పుతిన్ పర్యటనలో మరిన్ని S-400లతో పాటు S-500 కొనుగోలుకు ఆమోదం లభించనుంది.
* రఫేల్, F-21, F/A-18, యూరో ఫైటర్ టైఫూన్లకు పోటీనిచ్చే Su-57 ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ కొనుగోలుపైనా చర్చలు జరుగుతాయి. ఇవి రఫేల్ కంటే తక్కువ ధరకే లభించడం విశేషం.


