News April 14, 2025
సిద్దిపేట: రాజీవ్ యువ వికాస్.. నేడే చివరి తేదీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించడం కోసం చేపడుతున్న రాజీవ్ యువ వికాసం కోసం నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. నేటితో చివరి తేదీ ముగుస్తున్నందున సోమవారం సాయంత్రం 5 గంటలలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని కార్యాలయంలో ధ్రువ పత్రాలు సమర్పించాలని సూచించారు. సెలవు రోజులు అయినప్పటికీ దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్ కొనసాగుతుందని అన్నారు.
Similar News
News November 13, 2025
మంచిర్యాలలో విషాదం.. 7 నెలల గర్భిణి మృతి

మంచిర్యాలలో విషాదం జరిగింది. కాసిపేట మండలం కోమటిచేనుకు చెందిన లక్ష్మణ్ BSF జవాన్‌గా ఢిల్లీలో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య అనురాధ(35), కొడుకు ఉన్నాడు. కాగా భార్య ప్రస్తుతం 7నెలల గర్భిణి. ఆమెకు 2 సార్లు ఫిట్స్, కడుపునొప్పి రావడంతో మంచిర్యాలలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రసవం చేసేందుకు ఆపరేషన్ చేయగా తల్లి, పుట్టిన మగ శిశువు మృతిచెందారు. విషయం తెలిసి ఢిల్లీ నుంచి లక్ష్మణ్ కాసిపేటకు వస్తున్నారు.
News November 13, 2025
కరీంనగర్: విద్యాశాఖలో ఆ ‘FILE మాయం’..!

పదో తరగతి పరీక్షల మూల్యాంకన జవాబు పత్రాలు అమ్మగా వచ్చిన నిధులకు సంబంధించిన ఫైల్ కరీంనగర్ విద్యాశాఖలో మాయమైనట్లు తెలుస్తోంది. 2022- 23 MAR, JUN మూల్యాంకన పత్రాలను అధికారులు అమ్మారు. కాగా, దీని ద్వారా వచ్చిన రూ.1.30 లక్షలు పక్కదారి పట్టినట్లు స్పష్టమవుతోంది. దీనిపై అటు సూపరింటెడెంట్ ఇటు ఆఫీసు సిబ్బంది ఒకరిపైఒకరు అనుమానాలు వ్యక్తం చేసుకుంటున్నారు. ఈ గోల్‌మాల్ ముఖ్యమైన విద్యాశాఖను అభాసుపాలు చేస్తోంది.
News November 13, 2025
జనగామ: పత్తి అమ్మకంలో రైతుల ఇక్కట్లు..!

జిల్లా రైతులు పత్తి అమ్మకంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కపాస్ కిసాన్ యాప్ గురించి సరిగా తెలియకపోవడం, తెలిసినా అందులో ఫార్మర్ నాట్ రిజిస్టర్ అని చూపించడం, ఎవరి పేరు మీద ఎంత పత్తి ఉందో, ఎంత వరి ఉందో తెలియకపోవడంతో రైతులు సతమతమవుతున్నారు. అప్పుడు రిజిస్టర్ చేసుకొని వారికి వెంటనే రిజిస్టర్ చేసుకునేలా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. సమస్యను పరిష్కరించాలన్నారు.


