News March 9, 2025
సిద్దిపేట: రెండు రోజుల్లో పెళ్లి.. యువకుడి పరార్

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలానికి చెందిన యువతికి, జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామానికి చెందిన ఓ యువకుడికి వివాహ నిశ్చయం జరిగింది. ఈ నెల 8న చేర్యాల పట్టణంలోని ఫంక్షన్ హాల్లో వివాహం జరగాల్సి ఉంది. అయితే 2 రోజుల క్రితం యువకుడు తమ స్వగ్రామ సమీపంలోని మరో గ్రామానికి చెందిన యువతితో ఉడాయించాడు. విషయం తెలిసిన యువతి కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. పెళ్లి నిలిచిపోవడంతో న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు.
Similar News
News March 15, 2025
శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షలకు 365 మంది గైర్హాజరు: ఆర్ఐఓ

శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు శనివారం 365 మంది గైర్హాజరైనట్లు ఆర్‌ఐఓ పి దుర్గారావు శనివారం తెలిపారు. 17,452 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 17,087 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఆయన వివరించారు.
News March 15, 2025
రేపు జనగామ జిల్లాకు సీఎం రాక

జనగామ జిల్లాకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రూ.800 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు నియోజకవర్గానికి రానున్న సందర్భంగా స్టేషన్ ఘనపూర్ మండలంలోని శివునిపల్లిలో సభకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
News March 15, 2025
బస్సులు, మెట్రో వినియోగం పెరగాలి: CM రేవంత్

TG: హైదరాబాద్‌లో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య పెరుగుతోందని CM రేవంత్ అన్నారు. ‘నగరంలో రోజుకు 1,600 వాహనాలు కొత్తగా రోడ్ల మీదకు వస్తున్నాయి. వాటి రిజిస్ట్రేషన్లతో ఆదాయం వస్తున్నా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. HYDలో ఒక వ్యక్తి వెళ్లినా ప్రత్యేకంగా కారులోనే వెళ్తున్నారు. బస్సులు, మెట్రోను ఉపయోగించుకునే వారి సంఖ్య పెరగాలి. దిల్లీలో కాలుష్యం పెరిగి విద్యాసంస్థలు, కార్యాలయాలు మూసివేశారు’ అని గుర్తుచేశారు.