News March 20, 2025
సిద్దిపేట: రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

శుక్రవారం మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గినా.. తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం అయినప్పటికీ.. పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News December 1, 2025
JGTL: T-హబ్లో డ్రైవర్లకు అందని బిల్లులు

జగిత్యాల T–హబ్లో పనిచేసే డ్రైవర్లకు 8 నెలలుగా బిల్లులు అందటం లేదు. అధికారులను అడిగిన ప్రతిసారి దాటేస్తున్నారని డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 5 రూట్లలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు 1000-1500 వరకు శాంపిల్స్ సేకరించి T–హబ్ కు చేరుస్తారు. సోమవారం నుంచి డ్రైవర్లు విధులను నిలిపి వేయడంతో శాంపిల్స్ సేకరణ నిలిచిపోయాయి. ఇప్పటికైనా సమస్యపై ఉన్నతాధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాలి.
News December 1, 2025
గుమ్మలక్ష్మీపురం: చలికి వణకుతూ.. వానకు తడుస్తూ విద్యా పయనం

గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసు పంచాయతీ గాండ్ర గ్రామంలో 5వ తరగతి లోపు చదువుతున్న విద్యార్థులు సుమారు 18 మంది ఉన్నారు.అయితే గ్రామంలో పాఠశాల లేకపోవడంతో తమ పిల్లలు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాదుపురం కాలినడకన వెళ్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. శీతాకాలంలో చల్లని గాలులకు,వర్షాకాలంలో వానలకు పిల్లలు ఇబ్బందులు పడుతూ పాఠశాలకు వెళ్తున్నారని,అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
News December 1, 2025
విశాఖ: 20 వసంతాలు సరే.. పల్లెల్లో అభివృద్ధి జాడ ఏది!

గ్రేటర్ విశాఖగా మహానగరం అభివృద్ధి ప్రయాణం 2 దశాబ్ధాలు పూర్తి చేసుకుంది. 98వార్డుల్లో సుమారు 22లక్షల జనాభా, రూ.5 కోట్ల వార్షిక బడ్జెట్తో రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పోరేషన్గా ఆవిర్భవించింది జీవీఎంసీ. అయితే నగరంలో విలీనమైన శివారు గ్రామాలకు మాత్రం టాక్సుల మోత మోగుతుందే తప్ప పట్టణ ప్రజలకు అందుతున్న సౌకర్యాల్లో వాళ్ళ వాటా ఎంత అంటే ఆవగింజలో అరవయ్యో వంతే అన్నది విస్పష్టం. దీనిపై మీ కామెంట్.


