News March 20, 2025

సిద్దిపేట: రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

image

శుక్రవారం మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గినా.. తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం అయినప్పటికీ.. పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

Similar News

News April 22, 2025

టేకులపల్లి: అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య

image

టేకులపల్లి మండలం బావోజీ తండాకు చెందిన భూక్య లాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టేకులపల్లి ఎస్సై రాజేందర్ కథనం ప్రకారం.. అతనికి రూ.4 లక్షల అప్పు కావడం, ఈ మధ్యలో అతను అనారోగ్యం పాలై వెన్నుపూస ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు.

News April 22, 2025

ఏలూరు: ఉపాధ్యాయ పోస్టులకు  అప్లై చేయండి: డీఈవో

image

ఉమ్మడి ప.గో జిల్లాలో 1,035 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయని డీఈవో వెంకట లక్ష్మమ్మ సోమవారం తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 20 నుంచి మే 15వ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు సీబీఐ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారన్నారు. https://cse.ap.gov.in, https://apdsc.apcfss.in ను పరిశీలించాలన్నారు.

News April 22, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో 604 యూనిట్ల పంపిణీ

image

శ్రీ సత్యసాయి జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 604 యూనిట్లు పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో బ్యాంక్, వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు.

error: Content is protected !!