News April 4, 2025

సిద్దిపేట: రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

image

సిద్దిపేట జిల్లాలో గల వరిధాన్యం కోనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి ఆదేశించారు. శుక్రవారం కోహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో కోనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఐకేపీ సెంటర్‌లలోనే వరిధాన్యం కోనుగోలుకు అవసరమైన పాడి క్లీనర్లు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు.

Similar News

News January 8, 2026

భారీ నష్టాలు.. 780 Pts పడిపోయిన సెన్సెక్స్

image

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 263 Pts కోల్పోయి 25,876 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 780 Pts నష్టంతో 84,180కి పడిపోయింది. FIIల అమ్మకాలు, రష్యా ఆయిల్‌పై ఆంక్షలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ట్రేడ్ వార్ భయాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్‌లో 4 స్టాక్స్ మాత్రమే పాజిటివ్‌గా ట్రేడయ్యాయి. L&T షేర్లు 3.35%, TECHM 2.92%, TCS 2.74%, రిలయన్స్ 2.25% నష్టపోయాయి.

News January 8, 2026

పీఎంఏవై 2.0: పరకాల ముందంజ.. వరంగల్‌లో నెమ్మది

image

హన్మకొండ జిల్లాలో పీఎంఏవై-అర్బన్ 2.0 పథకం కింద లబ్ధిదారుల ధృవీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా సగటున 73.61% ఓటీపీ వెరిఫికేషన్ పూర్తయ్యింది. ఇందులో పరకాల మున్సిపాలిటీ 92.62%తో అగ్రస్థానంలో ఉండగా, వరంగల్ కార్పొరేషన్ (GWMC) 70.66% తో వెనుకబడి ఉంది. ఇప్పటివరకు 2,151 ఇళ్లకు జియో ట్యాగింగ్ పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.

News January 8, 2026

ట్రాఫిక్ సమస్య రానీయకూడదు: ఎస్పీ మహేశ్వర్ రెడ్డి

image

రథసప్తమి వేడుకలు నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య రానీయకూడదని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం పరిసరాలను పరిశీలించారు. 80 అడుగుల రహదారిలో మిల్లు జంక్షన్ వద్ద వాహనాలు పార్కింగ్ చేసే స్థలాలను గుర్తించారు. భక్తులకు దర్శనాలకు రాకపోకలకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని సిబ్బందికి సూచించారు. రద్దీ నియంత్రణకు తగు జాగ్రత్తలు వహించాలన్నారు.