News February 8, 2025

సిద్దిపేట: రైతులకు లాభం చేకూర్చేందుకు దోహదపడాలి: కలెక్టర్

image

వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని రైతులకు అత్యధికంగా లాభం చేకూర్చేందుకు ఉపయోగ పడేలా విద్య నేర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి అన్నారు. శుక్రవారం సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల గ్రామ పరిధిలోగల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సందర్శించారు.

Similar News

News November 21, 2025

IPSల బదిలీ.. సిటీకి కొత్త బాస్‌లు

image

రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. CID డీఐజీగా పరిమళ నూతన్, మహేశ్వరం DCPగా నారాయణరెడ్డి, నార్కోటిక్ SPగా పద్మజా, మల్కాజిగిరి DCPగా శ్రీధర్, సౌత్ జోన్ DCPగా కిరణ్ ఖారే, టాస్క్‌ఫోర్స్ DCPగా వైభవ్ గైక్వాడ్, ఎస్ఎంఐటీ డీసీపీగా రూపేశ్, గవర్నర్ ఏడీసీగా పి.సుభాష్, టీజీ ట్రాన్స్‌కో ఎస్పీగా శ్రీనివాస్, రాచకొండ క్రైమ్స్ డీసీపీగా గుణశేఖర్‌ను నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి.

News November 21, 2025

BREAKING: ఆసిఫాబాద్ SPగా నితిఖా పంత్

image

రాష్ట్రంలో 32 మంది IPSలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొమురం భీమ్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నితిఖా పంత్ నూతన ఎస్పీగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.

News November 21, 2025

RTC బస్సులో ప్రయాణించిన సీఎం సతీమణి

image

AP: కూటమి ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని CM చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వినియోగించుకున్నారు. ఆధార్ కార్డు చూపించి, ఫ్రీ టికెట్ పొందారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆమె శాంతిపురం నుంచి తుమ్మిసి వరకు బస్సులో ప్రయాణించారు. మహిళలతో మాట్లాడి ఉచిత బస్సు ప్రయాణం గురించి తెలుసుకున్నారు. అనంతరం తుమ్మిసి పెద్ద చెరువులో జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.