News January 29, 2025
సిద్దిపేట: రోడ్డు ప్రమాదం UPDATE.. ముగ్గురు మృతి

పెద్దపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<15299553>>సిద్దిపేట<<>>కు చెందిన భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృతుడు ఆకుల కనకయ్య వియ్యంకుడు జంగిటి జనార్ధన్(55) చిన్నకోడూరు మండలం గోనెపల్లి వాసి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కనకయ్య పెద్ద కొడుకుకి లివర్ నుంచి బ్లడ్ రావడంతో ప్రస్తుతం సర్జరీ చేసినట్లు కుటుంబీకులు తెలిపారు.
Similar News
News December 3, 2025
ALERT.. అతి భారీ వర్షాలు

AP: రాబోయే 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడతాయని IMD అంచనా వేసింది. రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.
News December 3, 2025
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటుందని, ప్రతి గ్రామంలో రైతులకు అవసరమైన సేవలు రైతు సేవా కేంద్రాల ద్వారా సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ జి.రాజకుమారి అన్నారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా నంద్యాల రూరల్ మండలం పెద్దకొట్టాల గ్రామ రైతు సేవా కేంద్రంలో రైతులతో ముచ్చటించారు. రబీ సీజన్కు సంబంధించిన ఈ-క్రాప్ నమోదు విధానం, ఎరువుల లభ్యతపై అవగాహన కల్పించారు.
News December 3, 2025
ఏపీ టెట్ హాల్టికెట్లు విడుదల

ఈ నెల 10 నుంచి జరగనున్న ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక <


