News February 22, 2025

సిద్దిపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

image

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడ్గ గ్రామానికి చెందిన వుడెం మల్లారెడ్డి శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. స్థానికుల వివరాలిలా.. శుక్రవారం అర్ధరాత్రి బైక్ పై సిద్దిపేట నుంచి మర్పడ్గకు వస్తుండగా పొన్నాల ఆయిల్ మిల్ దాటాక మూల మలుపు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో మల్లారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 14, 2025

పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్లాన్ ఫెయిల్.. డిపాజిట్లు గల్లంతు

image

పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా ప్రశాంత్ కిశోర్‌కు మంచి పేరుంది. ఎన్నికలు ఏవైనా ఆయన ప్లాన్ చేస్తే ఆ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందనే టాక్ ఉండేది. అయితే ఆ వ్యూహాలు తాను స్థాపించిన జన్ సురాజ్ పార్టీని అధికార పీఠం దగ్గరకు కూడా తీసుకొని వెళ్లలేకపోయాయి. బిహార్ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన మొత్తం 239 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2% ఓటు షేర్ మాత్రమే జన్ సురాజ్‌కు దక్కింది.

News November 14, 2025

బెల్లంపల్లి: పెద్దపులి దాడిలో ఆవు మృతి

image

బెల్లంపల్లి మండలం బుగ్గగూడ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం సమీప గ్రామాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. రాళ్లవాగు పక్కన ఉన్న పత్తి చేనులో ఆవుపై దాడి చేసిన హతమార్చినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన ఆవు బుగ్గగూడ గ్రామానికి చెందిన ఎల్లక్కదిగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. సమీప గ్రామాల ప్రజలు, రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News November 14, 2025

సంగారెడ్డి: జిల్లా వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన వసంతరావు

image

సంగారెడ్డి జిల్లా వైద్య అధికారిగా డాక్టర్ వసంత రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇన్‌ఛార్జ్ వైద్యాధికారిగా ఉన్న డాక్టర్ నాగ నిర్మల నుంచి బాధ్యతలు తీసుకున్నారు. డాక్టర్ వసంతరావు మాట్లాడుతూ.. జిల్లాలో ఆరోగ్య శాఖను బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేలా చూస్తానని చెప్పారు.