News February 28, 2025

సిద్దిపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు. కొండపాక మండలంలోని మర్పడగ గ్రామానికి చెందిన గుడికందుల బిక్షపతి(40) సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. కిందపడిన అతన్ని స్థానికులు 108 సహాయంతో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బిక్షపతి మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

Similar News

News November 1, 2025

NRPT: నేటి నుంచి జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమలు

image

నారాయణపేట జిల్లాలో శనివారం నుంచి పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని ఎస్పీ డాక్టర్ వినీత్ ప్రకటించారు. నవంబర్ 30 వరకు ఈ యాక్ట్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. పోలీసుల అనుమతులు లేకుండా రాజకీయ, కార్మిక, విద్యార్థి, కమ్యూనిస్ట్ పార్టీల నేతలు నిరసనలు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు. మతాల మధ్య చిచ్చు పెట్టే వార్తలు వ్యాప్తి చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

News November 1, 2025

రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

image

AP: రాష్ట్రంలో రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరులో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. వానలు పడే సమయంలో చెట్ల కింద నిలబడరాదని సూచించింది. కృష్ణా నదికి వరద తాకిడి ఉండటంతో పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News November 1, 2025

కాకినాడ: ప్రజాప్రతినిధులకి సత్కారాలా..! అధికారులలో నిరాశ

image

మొంథా తుఫాన్ సమయంలో కష్టపడిన కాకినాడ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలను సీఎం చంద్రబాబు సన్మానించడం చర్చనీయాంశంగా మారింది. క్షేత్రస్థాయిలో గ్రామస్థాయి నుంచి జిల్లా అధికారుల వరకు కష్టపడ్డారని, వారిని కాదని ప్రజాప్రతినిధులకు సన్మానం చేయడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ఓటేసి గెలిపించింది సేవ చేయడానికేనని, కష్టపడిన ఉద్యోగులు, స్వచ్ఛంద సేవకులను కూడా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.