News April 13, 2025
సిద్దిపేట: లారీని ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు

ఆగి ఉన్న లారీని వెనక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ టోల్గేట్ వద్ద జరిగింది. స్థానికుల వివరాలు.. కరీంనగర్ పద్మ నగర్కి చెందిన వారు బంధువుల పెళ్లికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్కు వెళ్లి వస్తుండగా టోల్గేట్ వద్ద ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో సుమారుగా 10 మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమం ఉంది.
Similar News
News November 22, 2025
పంట మునిగినా, జంతువుల దాడిలో దెబ్బతిన్నా ఫసల్ బీమా

PM ఫసల్ బీమా యోజనలో ఇప్పటి వరకు కరవు, వడగళ్లు, తుఫాన్ల వల్ల పంట నష్టం జరిగితే బీమా చెల్లించేవారు. ఇక నుంచి దాని పరిధి పెంచారు. ఏనుగులు, అడవి పందులు, కోతులు వంటి జంతువుల వల్ల పంట నాశనమైతే ఇకపై బీమా వర్తిస్తుంది. భారీ వర్షాల వల్ల పొలాలు నీట మునిగి పంట కుళ్లిపోయినా, దెబ్బతిన్నా పరిహారం చెల్లిస్తారు. 2026 ఖరీఫ్ సీజన్ (జూన్-జులై) నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 2025-26 ఖరీఫ్ సీజనుకు ఇది వర్తించదు.
News November 22, 2025
పంట దెబ్బతిన్న 72 గంటల్లోపు సమాచారం ఇవ్వాలి

జంతువుల దాడి, భారీ వర్షాలతో పొలాలు నీట మునిగి దెబ్బతింటే.. 72 గంటల్లోపు రైతులు వ్యవసాయ శాఖకు లేదా బీమా కంపెనీకి రైతులు సమాచారం అందించాలి. ‘క్రాప్ ఇన్సూరెన్స్ యాప్’లో నష్టపోయిన పంట ఫొటోలను జియో ట్యాగింగ్ చేసి అప్లోడ్ చేయాలి. ఏ జంతువుల వల్ల ఏ ఏ జిల్లాల్లో ఎక్కువ పంట నష్టం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి నోటిఫై చేయాలి. ఆ వివరాల ఆధారంగానే బీమా వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.
News November 22, 2025
సిరిసిల్ల జిల్లాలో మహిళా ఓటర్లు.. ఎందరంటే..?

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పురుషులతో పోలిస్తే మహిళల ఓట్లు 11,787 అధికంగా ఉన్నాయి. మొత్తం 260 గ్రామపంచాయతీలు, 2,268 వార్డుల పరిధిలో 3,53,351 మంది ఓటర్లు ఉండగా ఇందులో 1,70,772 మంది పురుషులు, 1,82,559 మంది మహిళలు ఉన్నారు. ఎల్లారెడ్డిపేటలో అత్యధికంగా 40,886 మంది ఓటర్లు ఉండగా, వీర్నపల్లి మండలంలో అత్యల్పంగా 11,727 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఆదివారం పూర్తికానుంది.


