News March 25, 2024

సిద్దిపేట: లారీని ఢీ కొట్టిన కారు.. ఒకరి మృతి

image

బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామ శివారు రాజీవ్ రహదారి మీద ఆగి ఉన్న లారీని కారు అదుపుతప్పి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాజకుమారి మృతి చెందినట్లు SI కృష్ణారెడ్డి తెలిపారు. మృతురాలి కుమారుడు అఖిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Similar News

News November 4, 2024

మాజీ సర్పంచ్‌ల అరెస్ట్‌లను ఖండించిన హరీశ్ రావు

image

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మాజీ సర్పంచ్‌ల అరెస్టులను, అక్రమ నిర్బంధాలను మాజీ మంత్రి హరీ‌శ్ రావు తీవ్రంగా ఖండించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్‌లను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని హైదరాబాద్‌కు వస్తే వారిని అడ్డుకోవడం, అక్రమంగా నిర్బంధించడం అప్రజాస్వామికమని అన్నారు.

News November 4, 2024

డ్రైవర్ సీటులో కూర్చొని హడలెత్తించిన కోతి

image

అల్లాదుర్గం మండల కేంద్రంలో ఇంజిన్ ఆఫ్ చేయకుండా ఉన్న ట్రాక్టర్ పైకి కోతి ఎక్కి స్టీరింగ్ పట్టుకోవడంతో ప్రజలు హడలెత్తారు. కోతి విచిత్ర గంతులు వేయడం, విన్యాసాలు చేయడం చూశాము కానీ.. డ్రైవర్ సీట్లో కూర్చొని డ్రైవర్ అవతారం ఎత్తింది. అల్లాదుర్గంలో రైతు ట్రాక్టర్ ఆఫ్ చేయకుండా దిగి పని నిమిత్తం పక్కకు వెళ్ళాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన కోతి ట్రాక్టర్ ఎక్కి స్టీరింగ్ పట్టుకొని అటూ ఇటూ తిప్పింది.

News November 4, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాలో మీ సేవలు బంద్..!

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో సోమవారం మీ సేవ కేంద్రాలు స్వచ్ఛందంగా బంద్ చేపట్టినట్లు మీ సేవ నిర్వాహకులు తెలిపారు. మీ సేవలు ప్రారంభించి 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం ఆర్టీసీ కళా భవన్‌లో 14వ వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. జిల్లాలోని మీ సేవ నిర్వాహకులందరూ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ఈ రోజు బంద్ ప్రకటించారు. మంగళవారం యథావిధిగా కార్యాలయాలు కొనసాగుతాయన్నారు.