News March 18, 2025
సిద్దిపేట: లిఫ్ట్ గుంతలో కుళ్లిన శవం లభ్యం

ములుగు మండలం లక్ష్మక్కపల్లి శివారులో ఓ కంపెనీ నిర్మాణ లిఫ్టు గుంతలో కూలిన శవం లభించినట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. ములుగు మండలం తానేదార్ పల్లికి చెందిన జామకాయల నర్సింలు (42) ఇంటి నుంచి వెళ్లి రెండు నెలలుగా కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సోమవారం కుళ్లిన స్థితిలో నర్సింలు శ్యామ్ లభించినట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News March 18, 2025
కసాయి వాళ్లను నమ్మకండి.. బీసీ నేతలతో సీఎం

TG: బీసీలకు 42% రిజర్వేషన్లపై బిల్లును ప్రవేశపెట్టినందుకు బీసీ సంఘాల నాయకులు సీఎం రేవంత్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘బీసీ కులగణన చేయాలనేది రాహుల్ గాంధీ ఆలోచన. మీరు కృతజ్ఞతలు చెప్పాల్సింది ఆయనకే. 10 లక్షల మందితో రాహుల్‌కు కృతజ్ఞత సభ పెట్టండి. సర్వేలో పాల్గొనని వారిని వెళ్లి కలుస్తున్నారు. ఆ కసాయి వాళ్లను నమ్మకండి’ అని సూచించారు.
News March 18, 2025
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

TG: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరిస్తూ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. 15 శాతం రిజర్వేషన్లను గ్రూపుల వారిగా పంచినట్లు సీఎం రేవంత్ తెలిపారు. గ్రూప్-1లోని అత్యంత వెనుకబడిన 15 కులాలకు 1%, మాదిగలున్న గ్రూప్-2లోని 18 కులాలకు 9%, మాలలు ఉన్న గ్రూప్-3లోని 26 కులాలకు 5% రిజర్వేషన్లు కేటాయించారు.
News March 18, 2025
ఏప్రిల్ 15 తర్వాత ‘అమరావతి’ పనులు

AP: వచ్చే నెల 15 తర్వాత రాజధాని అమరావతి పనులు పున:ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాత్కాలిక సచివాలయం వెనుక ఉన్న ప్రాంతంలో తొలుత పనులు మొదలుపెట్టనుంది. అక్కడే ప్రధాని మోదీతో సభను నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. కాగా ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు ప్రధానిని ఆహ్వానించనున్నారు.