News March 9, 2025
సిద్దిపేట: లోక్ అదాలత్‌లో 3073 కేసులు పరిష్కారం

జాతీయ మెగా లోక్ అదాలత్‌లో మొత్తం 3073 కేసులు పరిష్కరించినట్లు సిద్దిపేట సీపీ అనురాధ తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న వివిధ పోలీసు స్టేషన్లలో నమోదై అండర్ ఇన్వెస్టిగేషన్, కోర్టు విచారణలో ఉన్న ఐపిసి కేసులు-307, డ్రంక్ అండ్ డ్రైవ్, MV Act యాక్ట్ కేసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులు-2747, ఈ-పెట్టి కేసులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన కేసులు-19 పరిష్కరించినట్లు పేర్కొన్నారు.
Similar News
News July 6, 2025
రాజాపూర్: గొంతులో పూరి ఇరుక్కుని యువకుడి మృతి

జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఖానాపూర్‌కు చెందిన బ్యాగరి కిరణ్ కుమార్ (25) వ్యవసాయ పొలంలో పూరీలు తింటుండగా గొంతులో ఇరుక్కొనడం వల్ల ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
News July 6, 2025
వరల్డ్ అథ్లెటిక్స్ నిర్వహణ కోసం పోటీలో భారత్

వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌ను నిర్వహించడం కోసం భారత్ బిడ్లు దాఖలు చేయనుంది. 2029, 2031 ఎడిషన్ల కోసం బిడ్లు వేయనున్నట్లు నేషనల్ ఫెడరేషన్ స్పోక్స్ పర్సన్ ఆదిల్ సుమారివాలా వెల్లడించారు. ఏదైనా ఒక ఎడిషన్‌ను నిర్వహించే అవకాశం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తామన్నారు. బిడ్ల దాఖలుకు గడువు ఈ ఏడాది OCT1తో ముగియనుంది. హోస్ట్‌ల వివరాలను వరల్డ్ అథ్లెటిక్స్ వచ్చే ఏడాది SEPలో ప్రకటిస్తుంది.
News July 6, 2025
నిజామాబాద్‌లో సందడి చేసిన నటి అనసూయ

నిజామాబాద్ నగరంలో నటి అనసూయ ఆదివారం సందడి చేసింది. హైదరాబాద్ రోడ్డులోని ఓ షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. పలు పాటలకు స్టెప్పులు వేసి ఉర్రూతలూగించారు. ఆమె మాట్లాడుతూ.. నిజామాబాద్‌కు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇందూరులో తనకు ఇంత మంది అభిమానులు ఉండటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు.