News March 7, 2025

సిద్దిపేట: వడదెబ్బ జాగ్రత్తలు తెలపాలి: అదనపు కలెక్టర్

image

ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తెలపాలని సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్ వైద్యాధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్లో హీట్ రిలేటెడ్ ఇళ్లనేస్ (ఎండ తీవ్రతతో వచ్చే ఆరోగ్య సమస్యల పైన) జిల్లాల అధికారుల సమన్వయ సమావేశాన్ని, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పల్వాన్ కుమార్‌తో కలిసి సమావేశాన్ని నిర్వహించారు.

Similar News

News November 2, 2025

రాయికల్: కారు ఢీకొని రెండు గేదెలు మృతి

image

రాయికల్ మండలం ఉప్పుమడుగు గ్రామ శివారులో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల – రాయికల్ ప్రధాన రహదారిలో ఉప్పుమడుగు గ్రామ శివారులో రెండు గేదెలు అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతో అటుగా వెళ్తున్న కారు ఢీకొట్టడం వల్ల అక్కడికక్కడే మరణించాయి. కాగా, చెట్ల పొదల చాటు నుంచి అకస్మాత్తుగా గేదెలు రోడ్డుపైకి రావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో కారు ముందుభాగం ధ్వంసమైంది.

News November 2, 2025

75 తాళ్లూరులో చేతబడి కలకలం

image

పెదకూరపాడు మండలం 75 తాళ్లూరులో చేతబడి కలకలం రేగింది. కూలి పనులు చేసే అన్నదమ్ములు కొచ్చర్ల శ్రీనివాసరావు, డేవిడ్ కుమార్ ఇళ్ల మెట్లపై గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి తల వెంట్రుకలు, నిమ్మకాయలు, కోడిగుడ్లు, పసుపు కుంకుమ ఉంచారు. దీంతో స్థానికులు ఆందోళన చెందారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 2, 2025

పిఠాపురంలో నేటి చికెన్ ధరలు ఇలా

image

పిఠాపురం మార్కెట్లో చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే ఈ వారం రూ.10 నుంచి 20 రూపాయల వ్యత్యాసంతో ఉన్నాయి. లైవ్ చికెన్ రూ.130 రూపాయలు, చికెన్ బోన్ లెస్ రూ.210 రూపాయలు, చికెన్ లివర్ రూ.110, చికెన్ స్కిన్ లెస్ రూ.190 నుంచి 200, బోన్ లెస్ స్కిన్లెస్ చికెన్ రూ.250 రూపాయలు ఉన్నాయి. ఆదివారం కావడంతో మాంసం ప్రియులు మాంసం దుకాణాల వద్ద బారులు తీరారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.