News February 27, 2026
సిద్దిపేట విద్యార్థికి స్టేట్ సెకండ్ ర్యాంక్

ఫోరం ఆఫ్ ఫిజికల్ సైన్స్ నిర్వహించిన రాష్ట్రస్థాయి భౌతిక రసాయన శాస్త్ర ప్రతిభా పరీక్షలో పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ జక్కాపూర్ విద్యార్థి అశ్విత్ రెడ్డి సత్తా చాటాడు. 33 జిల్లాల నుంచి సుమారు 100 మంది పాల్గొన్న ఈ పోటీలో 9వ తరగతి చదువుతున్న అశ్విత్ 50కి 35 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. విద్యార్థి ప్రతిభను చూసి పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News April 14, 2026
ఏలూరు: డ్వాక్రా 13.64 కోట్ల రుణాల పంపిణీ

ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో మంగళవారం డ్వాక్రా మహిళలకు రూ.13.64 కోట్ల రుణాలను జేసీ అభిషేక్ గౌడ్, జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ అందజేశారు. ఎస్సీ కార్పొరేషన్, డీఆర్‌డీఏ ద్వారా మంజూరైన ఈ నిధులను మహిళలు ఆర్థికాభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మొక్కంటి, పీడీ విజయలక్ష్మి పాల్గొన్నారు.
News April 14, 2026
ఇంజెక్షన్ల రీయూజ్.. పాక్‌లో 331 మంది చిన్నారులకు HIV!

పాకిస్థాన్‌లోని టౌన్సాలో THQ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం చిన్నారులను బలితీసుకుంటోంది. ఇంజెక్షన్ల కోసం వాడిన సిరెంజ్‌లనే మళ్లీ ఉపయోగించడంతో
331 మంది చిన్నారులు HIV బారిన పడినట్లు బీబీసీ దర్యాప్తులో తేలింది. 2024 నవంబరు నుంచి 2025 అక్టోబరు మధ్య ఈ కేసులు నమోదయ్యాయి. కాగా వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఆరోపణలను ఆస్పత్రి యాజమాన్యం ఖండిస్తోంది.
News April 14, 2026
సీఎం పదవికి నితీశ్ రాజీనామా

ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రిజైన్ లెటర్‌ను గవర్నర్‌కు అందజేశారు. మరికాసేపట్లో బీజేపీ కొత్త సీఎం అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించనుంది. బిహార్‌కు నితీశ్ 21 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ రాష్ట్రంలో 243 అసెంబ్లీ సీట్లు ఉండగా NDAకు 202 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.


