News February 23, 2025

సిద్దిపేట: విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడు

image

సిద్దిపేట జిల్లా కొండపాకలో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్‌పై కేసు నమోదైంది. వివరాలు.. ఖమ్మంపల్లి పాఠశాల సైన్స్ టీచర్ దేవయ్య ప్రాక్టికల్స్ పేరుతో విద్యార్థినులతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దేవయ్య వేధింపులు భరించలేక విద్యార్థినులు హెచ్‌ఎంకు తెలిపారు. విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దేవయ్యపై కేసు నమోదు చేశారు. దేవయ్యను సస్పెండ్ చేసినట్లు డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News October 31, 2025

ఆదిలాబాద్‌లో క్రీడాకారుల ఎంపిక పోటీలు

image

జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో U-17 జోనల్ లెవల్ స్పోర్ట్స్ ఎంపిక పోటీలు జరగనున్నాయి. నవంబర్ 3న బాలబాలికల రగ్బీ, 4న బాలుర కబడ్డీ, 5న బాలికల క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. క్రీడాకారులు సంబంధిత పోటీల్లో పాల్గొనేందుకు ఆరోజు ఉదయం 10 గంటలలోపు హాజరుకావాలని పోటీల కన్వీనర్లు తెలిపారు.

News October 31, 2025

కరీంనగర్ జిల్లాకు నేడు CM..!

image

మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఇవాళ మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేయనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని హుస్నాబాద్, చిగురుమామిడి, సైదాపూర్ ప్రాంతాల్లో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించి హుజూరాబాద్ మీదుగా వరంగల్ జిల్లాకు చేరుకోనున్నారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో ఏరియల్ సర్వే చేసిన ప్రాంతాల్లో జరిగిన నష్టంపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

News October 31, 2025

NLG: 6.7 KM పొడవునా దెబ్బతిన్న రోడ్లు

image

జిల్లాలో రోడ్డు భవనాల శాఖ పరిధిలోని 24 ప్రాంతాల్లో 6.7 కిలోమీటర్ల పొడవున రోడ్లు దెబ్బతినగా అందులో 15 ప్రాంతాల్లో పూర్తిగా ధ్వంసమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాటిల్లో గురువారం 7 ప్రాంతాల్లో రాకపోకలను పునరుద్ధరించారు. వాటి తాత్కాలిక మరమ్మతులకు రూ.35 లక్షలు అవసరమని అధికారులు అంచనా వేశారు. శాశ్వత మరమ్మతులకు రూ.9.70 కోట్లు అవసరమని ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు.