News February 23, 2025
సిద్దిపేట: విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడు

సిద్దిపేట జిల్లా కొండపాకలో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్‌పై కేసు నమోదైంది. వివరాలు.. ఖమ్మంపల్లి పాఠశాల సైన్స్ టీచర్ దేవయ్య ప్రాక్టికల్స్ పేరుతో విద్యార్థినులతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దేవయ్య వేధింపులు భరించలేక విద్యార్థినులు హెచ్ఎంకు తెలిపారు. విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దేవయ్యపై కేసు నమోదు చేశారు. దేవయ్యను సస్పెండ్ చేసినట్లు డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News January 10, 2026
మెదక్: బాలల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలి: కలెక్టర్

బాలల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం మెదక్ జిల్లా కేంద్రంలోని బాలల సదనం సందర్శించారు. అక్కడి పిల్లల సౌకర్యాలు, విద్య, పోషకాహారం వంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందిస్తున్న మెనూ, నిత్యావసర వస్తువులను పరిశీలించారు. బాలల వారి సంక్షేమం, ఉన్నత భవిష్యత్‌కు ఆసక్తిని, గమనించి వారి అభివృద్ధికి చేదోడుగా ఉండాలన్నారు.
News January 10, 2026
మెదక్: ‘సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే చర్యలు’

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం ఏడు రోజుల సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు పాఠశాలలు పూర్తిగా మూతపడనున్నాయని, సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
News January 10, 2026
మెదక్: ‘సీఎం కప్ క్రీడలు.. 16 వరకు ఛాన్స్’

మెదక్ జిల్లాలో ‘సీఎం కప్’ క్రీడల నిర్వహణపై అదనపు కలెక్టర్ నగేష్ మండల విద్యా అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్రీడలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈ నెల 16లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. క్రీడల అవగాహన కోసం ఈనెల 12 వరకు టార్చ్ ర్యాలీలు నిర్వహిస్తామని వెల్లడించారు.


