News January 9, 2025
సిద్దిపేట: విద్యార్థులను చితకబాదిన ఫిజికల్ డైరెక్టర్
విద్యార్థులను టీచర్ చితకబాదిన ఘటన సిద్దిపేట(D) దుద్దెడ గురుకులలో జరిగింది. టెన్త్,ఇంటర్ విద్యార్థులకు ఉదయం నిర్వహించిన స్టడీ అవర్స్‌కు ఆలస్యంగా వచ్చిన 30 మంది విద్యార్థులను PD వాసు ఒళ్లంతా వాతలు వచ్చేలా కొట్టాడు. తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని పిల్లలను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. PDని సస్పెండ్ చేయాలని ఆందోళనకు దిగారు. తీవ్రంగా గాయపడిన వారికి సిద్దిపేటలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించినట్లు సమాచారం.
Similar News
News January 12, 2025
మెదక్: తప్పని సరిగా అనుమతి తీసుకోవాలి: సీపీ
సిద్దిపేట జిల్లాలో అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించవద్దని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ తెలిపారు. ఈ నెల 13 నుంచి 28 వరకు కమిషనరేట్ పరిధిలో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
News January 12, 2025
మెదక్: యువత వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి: ఎంపీ
భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు స్వామి వివేకానంద అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కొనియాడారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఎంపీ స్వామి వివేకానందకు నివాళులర్పించారు. లేవండి.. మేల్కొండి.. గమ్యం చేరేవరకు ఆగకండి.. అంటూ ప్రపంచంలోని యువతకు స్వామి వివేకానంద మహోన్నతమైన సందేశం ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందరన్నారు.
News January 12, 2025
MDK: పండగకు పయాణం.. దొంగలతో జాగ్రత్త..!
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికులను ఉమ్మడి మెదక్ జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు. రద్దీని అదనుగా తీసుకుని దొంగలు చేతివాటం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లలో చోరీలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.