News July 10, 2024

సిద్దిపేట: విద్యార్థులు లేక మూతపడిన పాఠశాలలు

image

అక్కన్నపేట మండలంలో విద్యార్థులు లేకపోవడంతో 11 పాఠశాలలు మూతపడ్డాయి. ఆయా పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులను ఇతర పాఠశాలకు డిప్యూటేషన్ చేశారు. విద్యార్థులు లేకపోవడంతో కొన్ని, గౌరవెల్లి ప్రాజెక్టులో ముంపునకు గురి అవ్వడంతో కొన్ని పాఠశాల మూతపడ్డాయి. గుడాటిపల్లి, సోమాజితండా, తెనుగుపల్లి, గౌరవెల్లి, పంచరాయితండా, దేవానాయక్ తాండ, బంగారులొద్ది తాండ, చౌటకుంట తండా, రంగన్న కుంట పాఠశాలలు మూతపడ్డాయి.

Similar News

News November 16, 2025

చేగుంట: ఎస్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడిగా బంగారయ్య

image

చేగుంట మండలం చందాయిపేట హైస్కూల్ ఉపాధ్యాయులు గంగిశెట్టి బంగారయ్య ఎస్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. బంగారయ్యకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాండు, నర్సింలు, చేగుంట మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పెంటగౌడ్, మనోహర్ రావు, కార్యవర్గ సభ్యులు సుధాకర్, సిద్ధిరాములు సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు వాణి శుభాకాంక్షలు తెలిపారు

News November 16, 2025

మెదక్: 1.19 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

image

జిల్లాలో ఇప్పటివరకు 27,993 మంది రైతుల నుంచి 1,19,461.560 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రూ.102.84 కోట్ల చెల్లింపులు జరిగాయని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు వేగవంతం చేయాలని ఆదేశించారు. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేటలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. కొనుగోళ్ల తీరును తీరును పరిశీలించారు.

News November 16, 2025

MDK: పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా వైద్యాధికారులు పని చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆదివారం ఆయన శంకరంపేట (ఆర్) మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు పుస్తకాలు, మందుల స్టాక్ బోర్డులను నిశితంగా పరిశీలించారు. వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. సమయపాలన పాటించాలని అధికారులకు ఆదేశించారు.