News September 2, 2024

సిద్దిపేట: విషాదం.. అన్నాచెల్లెలు సూసైడ్

image

సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్‌లో అన్నాచెల్లెలు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. కాసులాబాద్ కిష్టయ్య భార్య ఏడాది క్రితం మృతిచెందగా ఇద్దరు కొడుకులు, కూతురుతో నివసిస్తున్నాడు. నిన్న కూతురు కళ్యాణి (16) చెరువులో పడి చనిపోగా.. అన్న రాము(20) పురుగు మందు తాగి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు చనిపోయాడు. కళ్యాణి మృతదేహం మసిరెడ్డి కుంటలో ఈరోజు లభ్యమైంది.

Similar News

News September 20, 2024

విశ్రాంత అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వేణుగోపాలస్వామి

image

విశ్రాంత పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా టి వేణుగోపాలస్వామి నియమితులయ్యారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రూపేష్ వేణుగోపాలస్వామిని సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు విశ్రాంత ఉద్యోగులు పోలీసు సంఘం అధ్యక్షులు ఎల్లయ్య, వైస్ ప్రెసిడెంట్ అఫ్జల్, జాయింట్ సెక్రెటరీ ప్రభాకర్ రావ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ప్రభాకర్ రెడ్డి, జీవన్, జహింగీర్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

News September 20, 2024

MDK: నోటి మాట.. ఆ గ్రామం ఆదర్శం..!

image

నోటి మాటతో కట్టుబడి ఆ గ్రామస్థులందరూ కలిసి మద్యపానాన్ని నిషేధించి నేటికి 10 ఏళ్ల పైనే అవుతోంది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని గూడెంగడ్డలో గ్రామస్థులు గ్రామంలో బెల్టు షాపుల ద్వారా మద్యపానం విక్రయించడం నేరంగా భావించి నాటి నుంచి నేటి వరకు ఎలాంటి విక్రయాలు జరుపకూడదనే నిబంధనను మౌఖికంగానే విధించుకున్నారు. దీంతో మద్యపానం విక్రయించకుండా గూడెంగడ్డ గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది.