News March 1, 2025

సిద్దిపేట: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

image

సిద్దిపేటలో నిన్న జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. వర్గల్ మం. గౌరారం వద్ద <<15609808>>రాజీవ్ రహదారిపై<<>> ట్రక్కును కారు ఢీకొట్టిన ఘటనలో మేడ్చల్‌కు చెందిన వ్యాపారి శ్యాంబహదూర్ సింగ్(41) చనిపోగా.. డ్రైవర్ చందు, సాయి కుమార్ గాయాలతో బయటపడ్డారు. మృతుడి భార్య సంగీత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కొండపాక మండలం మర్పడగకు చెందిన పెయింటర్ <<15605788>>భిక్షపతి<<>> సైకిల్ పైనుంచి కిందపడి మృతిచెందాడు.

Similar News

News March 1, 2025

MDCL: వామ్మో..చెమట గక్కిస్తున్న ఎండ..!

image

MDCL జిల్లాలో మార్చి మొదట్లోనే చెమటలు గక్కెలా ఎండ దంచికొడుతుంది. నేడు బాలానగర్ పరిధి ఓల్డ్ సుల్తాన్ నగర్ ప్రాంతాల్లో 36.2డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. మోతీనగర్ ప్రాంతాల్లోనూ ఉక్కపోత వాతావరణం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ఎండ దంచికొడుతుందని పేర్కొంది. ఇప్పుడే ఇలా ఉంటే, ఏప్రిల్, మే నెలలో ఎండలు ఎలా ఉంటాయో..! మరీ. 

News March 1, 2025

VZM: త్వరలో ఉమెన్ హెల్ప్ డెస్క్‌లు: SP

image

పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. స్థానిక పోలీస్ కార్యాలయంలో జిల్లాకు చెందిన SHOలతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం స్టేషన్లలో ఉన్న రిసెప్షన్ సెంటర్లను ఉమెన్ హెల్ప్ డెస్క్‌గా మార్చనున్నామని తెలిపారు. డెస్క్‌లో ఒక మహిళా ఏఎస్ఐ బాధ్యులుగా నియమిస్తామని తెలిపారు.

News March 1, 2025

KNR: MLC ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

image

కరీంనగర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి శనివారం సందర్శించారు. కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. కౌంటింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన బాక్స్‌లను, సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈనెల 3 నుంచి జరగబోయే కౌంటింగ్ కోసం మైక్రో అబ్జర్వర్లు, సూపర్‌వైజర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.

error: Content is protected !!