News November 12, 2024

సిద్దిపేట: శతాబ్దాల చరిత్ర గల ఆలయం.. అభివృద్ధి చేస్తే మేలు

image

అక్బర్‌పేట భూంపల్లి మండలంలోని గాజులపల్లి, వీరారెడ్డిపల్లి, జంగాపల్లి శివారులో దాదాపుగా వెయ్యి ఎకరాలను మించిన రాతిబండపై వెలిసిన బండ మల్లన్న ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి సంక్రాంతి రోజున ఎడ్ల బండ్లు కట్టి మల్లన్న ఆలయం చుట్టు భక్తులు ప్రదక్షిణలు చేసి వారి భక్తిని చాటుకుంటారు. ఇంతటి విశిష్టత కలిగిన గుడిని ప్రభుత్వం ఆర్థిక వనరులతో అభివృద్ధి చేయాలని ఇక్కడి ప్రాంత ప్రజల ఆకాంక్షిస్తున్నారు.

Similar News

News December 6, 2025

మెదక్: నేడు రెండో విడత అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

image

మెదక్ జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీలలో పోటీ చేసే అభ్యర్థులకు నేడు గుర్తులు కేటాయించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండగా, అనంతరం తెలుగు అక్షరమాల పద్ధతిలో అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నారు. మెదక్, చిన్న శంకరంపేట, రామాయంపేట, నిజాంపేట తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి మండలాలలో రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి.

News December 6, 2025

ఉమ్మడి మెదక్ జిల్లాలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలో కోహీర్ 10.0, మెదక్ జిల్లాలో పెద్ద నర్లాపూర్11.2, సిద్దిపేట జిల్లాలో అంగడి కిష్టాపూర్ 10.6 °C అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలితీవ్రత దృష్ట్యా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

News December 6, 2025

మెదక్: అప్పు ఎంతైనా పర్వాలేదు.. గెలవాలంతే!

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 11, 14, 17వ తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ తేదీలు దగ్గర పడుతున్న కొద్ది జిల్లాల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. పలు పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా కాసుల వేట కొనసాగిస్తున్నారు. ఎక్కువ అభ్యర్థులు పోటీ చేసే జనరల్ స్థానాల్లో ఈ ధోరణి తారస్థాయిలో ఉంది. కొంతమంది అభ్యర్థులు అయితే తమ వద్ద డబ్బులు లేక అప్పులు చేసి మరి ఖర్చు పెడుతున్నారు.