News February 5, 2025
సిద్దిపేట: ‘సదరం క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించే సదరం క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి జయ దేవ్ ఆర్య సూచించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థోపెటిక్, జనరల్ మెడిసిన్, మానసిక వైకల్యం చెవుడు, మూగ, కంటి చూపు సమస్యలు ఉన్నవారు సంప్రదించాలని కోరారు. క్యాంపు కావాల్సిన ధ్రువ పత్రాలు మీ సేవలో దరఖాస్తు చేసుకొని రావాలని తెలిపారు.
Similar News
News December 1, 2025
కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం

కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జిని MP శ్రీభరత్ నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ పిలా శ్రీనివాసరావు, MLA వెలగపూడి, VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు. విశాఖను పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. సముద్ర మట్టానికి సుమారు 1020 అడుగుల ఎత్తులో సురక్షితమైన పద్ధతిలో ఈ వంతెన నిర్మించినట్లు ప్రణవ్ వివరించారు. త్వరలోనే త్రిశూల్ ప్రాజెక్ట్ కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
News December 1, 2025
జిల్లాలో 2,28,968 మందికి రూ. 98.91 కోట్లు పంపిణీ: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ అందజేస్తోందని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. విజయవాడ గులాబీతోటలో సోమవారం నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, లబ్ధిదారులతో మాట్లాడి సమస్యల గురించి తెలుసుకున్నారు. జిల్లాలో 2,28,968 మందికి రూ. 98.91 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పారదర్శకతతో పథకాలను అమలు చేస్తూ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
News December 1, 2025
ఎయిడ్స్‌పై అవగాహన అత్యంత అవసరం: కలెక్టర్

వరల్డ్ ఎయిడ్స్ డే-2025 సందర్భంగా వరంగల్ జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో నిర్వహించిన అవగాహన సమావేశంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎయిడ్స్‌పై సమాజంలో విస్తృత అవగాహన అవసరమని, ముందస్తు జాగ్రత్తలు, సరైన సమాచారంతోనే వ్యాధిని నిరోధించగలమని పేర్కొన్నారు.


