News February 5, 2025
సిద్దిపేట: ‘సదరం క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించే సదరం క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి జయ దేవ్ ఆర్య సూచించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థోపెటిక్, జనరల్ మెడిసిన్, మానసిక వైకల్యం చెవుడు, మూగ, కంటి చూపు సమస్యలు ఉన్నవారు సంప్రదించాలని కోరారు. క్యాంపు కావాల్సిన ధ్రువ పత్రాలు మీ సేవలో దరఖాస్తు చేసుకొని రావాలని తెలిపారు.
Similar News
News January 21, 2026
మే నెలలో సముద్రంలోకి మత్స్య-6000

సముద్ర గర్భ రహస్యాల అన్వేషణలో భారత్ కీలక అడుగు వేయబోతుంది. ‘సముద్రయాన్’ ప్రాజెక్టులో భాగంగా చెన్నై NIOT కేంద్రంలో తయారైన నాలుగో తరం సబ్‌మెరైన్ ‘మత్స్య-6000’ను మే నెలలో సముద్రంలోకి ప్రవేశపెట్టనున్నారు. డీప్ ఓషియన్ మిషన్ (DOM) కింద రూపొందిన ఈ సబ్‌మెరైన్‌లో 500 మీటర్ల లోతు వరకు ముగ్గురు ఆక్వానాట్స్ ప్రయాణిస్తారు. ఈ ప్రయోగం విజయవంతమైతే US, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ సరసన భారత్ నిలుస్తుంది.
News January 21, 2026
PDPL: మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరణ

అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ దాసరి వేణు మంగళవారం సమీకృత కలెక్టరేట్లో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల పోస్టర్ ను ఆవిష్కరించారు. జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పి నరేష్ కుమార్, తహసీల్దార్ రాజ్ కుమార్, రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ సన ఫక్రుద్దీన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
News January 21, 2026
TTD జేఈవోగా శరత్ నియామకం

TTD జేఈవో(హెల్త్ అండ్ ఎడ్యుకేషన్)గా డాక్టర్ ఏ.శరత్ నియామకమయ్యారు. 2005 బ్యాచ్‌కు చెందిన ఆయన రిటైర్మెంట్ అయిన తరువాత ప్రభుత్వం రీ-ఎంప్లాయిమెంట్ కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏడాది పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.


