News March 18, 2025
సిద్దిపేట: సమస్యలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి: కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను జిల్లా అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, అబ్దుల్ హమీద్ లతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 43 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
Similar News
News April 19, 2025
మద్దూరు: సీఎం ఫోటోను అవమానపరిచినందుకు అరెస్ట్..!

కోటకొండ గ్రామానికి చెందిన కావలి వెంకటేష్ అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఫోటోలను అవమానకరంగా ఎడిట్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్సాప్ గ్రూపులలో ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా ఫోటోలను షేర్ చేశాడు. ఈ ఘటనపై రేణివట్ల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి యాసిన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
News April 19, 2025
NZB: మద్యం తాగుతూ.. పాటలు వింటూ మృతి(UPDATE)

నగరంలోని సుభాష్ నగర్లో ఆటోలో మృతి చెందిన వ్యక్తిని న్యూ ఎన్జీవోస్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ బాలచందర్(36)గా పోలీసులు గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆటోలో పాటలు వింటూ మద్యం సేవిస్తుండగా ఒకసారిగా ఫిట్స్ వచ్చి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహన్ని మార్చురీకి తరలించారు.
News April 19, 2025
బంగ్లాదేశ్‌లో హిందూ నేత హత్య

బంగ్లాలో హిందువులపై దాడి కొనసాగుతోంది. దీనాజ్‌పూర్ జిల్లాలో భాబేశ్ చంద్ర అనే హిందూ నేతను దుండగులు దారుణంగా కొట్టి చంపారు. బంగ్లాదేశ్ పూజా ఉద్యాపన్ పరిషద్ సంస్థకు ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. నలుగురు వ్యక్తులు బైక్స్‌పై వచ్చి ఆయన్ను కిడ్నాప్ చేశారని, మృతదేహాన్ని తిరిగి తీసుకొచ్చి ఇంటి ముందు పారేశారని కుటుంబీకులు పోలీసులకు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.